Monday, March 23, 2026

* *దామలచెరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం ముఖ్య అతిథిగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని*

నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని దామలచెరువు లో మెగా పేరెంట్స్ కమిటీ సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని హాజరైయ్యారు ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన ఎమ్మెల్యే కి పాఠశాల ఉపాధ్యాయులు, కమిటీ సభ్యులు, కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు.స్వాగతకార్యక్రమంలో విద్యార్థినులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.గత వైసిపి ప్రభుత్వ పాలనలో విద్యావ్యవస్థను సర్వనాశనం చేసిందనిఎమ్మెల్యే పులివర్తి నాని మండిపడ్డారు కూటమి ప్రభుత్వ రాకతో ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , విద్యా& ఐటీ శాఖామంత్రి నారా లోకేష్ ఆలోచనావిధానాంతో రాష్ట్రం అభివృద్ధి పదం వైపు పరిగెడుతుంది.విద్యా వ్యవస్థను కూడా ఆదాయ వనరుగా మార్చుకున్న ఘనత గత వైసిపి పాలకులకు దక్కుతుందని అన్నారు కానీ కూటమి ప్రభుత్వం విద్యావ్యవస్థను పటిష్ట పరుస్తూ … పిల్లల తల్లిదండ్రులను పాఠశాల అభివృద్ధిలో భాగస్వామ్యంతో చేసిందని ఎమ్మెల్యే తెలిపారు పాఠశాలల అభివృద్ధికి విద్యార్థుల తల్లిదండ్రుల సూచనలు సలహాలతో వారి ఉజ్వల భవిష్యత్తుకు ప్రభుత్వం సహకారం అందిస్తుంది.కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల నిర్వహణను కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుందని తెలిపారు కూటమి ప్రభుత్వం పాఠశాలవిద్యార్ధులకు ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టి… వారి తల్లిదండ్రులకు ఆర్థికంగా చేదోడు వాదోడుగా నిలుస్తుందని తెలిపారు ఆత్మీయ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు ప్రభుత్వ పథకాలు తీరును పాఠశాలలోని విద్యార్థులను అడిగి తెలుసుకొని సంతృప్తిని వ్యక్తం చేశారు మన కూటమి ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివేవారికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నాణ్యమైన విద్యాభ్యాసం కొనసాగిస్తుందని ఎమ్మెల్యే తెలిపారువిద్యార్థులు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని మంచి భవిష్యత్తు ప్రణాళికతో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నాననిఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు పాఠశాలలో నిర్వహిస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకనిర్వహణపై విద్యార్థులను అడిగి తెలుసుకొని వారితోపాటుగా ఎమ్మెల్యే కలిసి భోజనం చేసారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News