Wednesday, March 25, 2026

* *ప్రభుత్వ పాఠశాల బలోపేతం ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు**

నేటి సాక్షి తిరుపతి * (బాదూరు బాల)తిరుపతి శ్రీ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ శుక్రవారం జరిగిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0 లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పాల్గొన్నారు. విద్యావ్యవస్థ మెరుగుపరిచేందుకు పలు సంస్కరణలను ప్రభుత్వం తీసుకొచ్చిందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. డ్రాప్ అవుట్ లు లేకుండా చూసేందుకు తల్లికి వందనం పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని ఆయన చెప్పారు. టీచర్ల బదలీలను పారదర్శకంగా చేసిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ లకే దక్కుతుందని ఆయన తెలిపారు. విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించేందుకు ప్రతి శనివారం నో బ్యాగ్ డే ను అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ తో తల్లితండ్రులు ఉపాధ్యాయులు మధ్య సమన్వయం పెరుగుతుందని ఆయన చెప్పారు. విద్యార్థుల ఎలా చదువుతున్నారో తల్లితండ్రులు తెలుసుకునేందుకు లీప్ యాప్ ను ప్రభుత్వం తీసుకువచ్చిందని ఆయన తెలిపారు. మార్చిలో జరిగే పరీక్షల కోసం విద్యార్థులను మరింత మెరుగ్గా రాణించేందుకు టీచర్లు, తండ్రులు మరిత బాధ్యతతో వ్యవహరించాలని ఆయన కోరారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News