.నేటి సాక్షి పాములపాడు డిసెంబర్ 05 :–పాములపాడు మండలం కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ కార్యక్రమం లో హెచ్ యం , శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా పేరెంట్స్ మీటింగ్ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గిత్త. జయసూర్య పాల్గొనడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గిత్త. జయసూర్య మాట్లాడుతూ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం బడివైపు ఒక అడుగు వేయాలి. ప్రతి ఒక్కరు విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆశిస్తున్నాను.మీరు బాగా చదువుకోవడం వల్ల మన స్కూల్ కి మన ఊరికి దేశానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలి, అంతేకాకుండా మన భారత దేశానికి స్రీలు క్రీకెట్ జట్లు విజయాన్ని సొంతం చేసుకున్నారు.కాబట్టి వీరికోసం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా స్త్రీలకు ఉచిత బస్సు ప్రయాణం కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క తల్లి తండ్రులు విద్యార్థులను స్కూల్ కి పంపించాలి బాగా చదువుకోవాలి. చదివించాలి. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది అన్ని పరీక్షలు ఒకే పుస్తకంలో రాసేలా మూల్యాంకన పుస్తకాలను కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది.పాఠశాలల్లో అన్ని వసతులు ఉన్నాయా అంటూ ఎమ్మెల్యే తల్లిదండ్రులను అడిగారు తల్లిగా ప్రతి సారి మీటింగ్ లకు వచ్చారా , పాఠశాల పిల్లలను ఉపాధ్యాయులు చదువు బాగా చెప్తున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పిల్లలకి మధ్యాహ్నం భోజనము వడ్డించిన ఎమ్మెల్యే గిత్త. జయసూర్య. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ, యన్.చంద్రశేఖర్ ఎస్ ఐ.కె.సురేష్ బాబు, ఎంఈఓ బాలాజీ నాయక్ పాములపాడు సొసైటీ ఛైర్మన్ సి.గోవిందు, మద్దూరు సొసైటీ ఛైర్మన్, వాడల జనార్ధన్ రెడ్డి, డివిఎంసి మెంబర్ లింగాల నాగరాజు తెలుగుదేశం పార్టీ మండల నాయకులు చెల్లె.హరినాథరెడ్డి, బండ్లమూడి వెంకటేశ్వర వెంపెంట . గ్రామ మాజీ సర్పంచ్ టేకూరు.రామసుబ్బామ్మ, బోనం పల్లె వినయ్,రావు,స్కూల్ డ్రిల్లు మాస్టర్ పి డి.రాజశేఖర్, ఉపాధ్యాయులు ద్రాక్షాయిని బాయి , దామ రేకుల రవి, నాయుడు భవిత పాఠశాల ఉపాధ్యాయులు శంషుద్దీన్ , రామ్మూర్తి మరియు మండల నాయకులు విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.





