నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి డిసెంబర్ 5 చౌడేపల్లి మండలం కోటురు మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఈరోజు ఘనంగా మెగా పేరెంట్స్ మీటింగ్3.0 నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బళ్ళాపురం మురళి ప్రసంగిస్తూ పాఠశాల, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సమాజం ఈ నాలుగు కలిస్తేనే విద్యార్థి సర్వతో ముఖాభివృద్ధి సాధించగలడని విద్యార్థి సర్వతోముఖాభివృద్ధి సాధిస్తే ఆ గ్రామం మండలం జిల్లా రాష్ట్రము దేశము అభివృద్ధి పదములోకి వెళుతుందని తెలియజేశారు విద్యార్థులు చాలా సులభంగా ఆటల ద్వారా విద్యను నేర్చుకోవడానికి ప్రభుత్వం టర్ల, ఎఫ్ ఎల్ ఎన్ జాదు పితార వంటి ప్రోగ్రాం ద్వారా విద్యార్థులు చాలా సులభంగా పాఠాలు నేర్చుకోవడానికి ఉన్నాయని తెలియజేశారు మన మండల విద్యాశాఖ అధికారులు గౌరవనీయులు కేశవరెడ్డి సార్ గారు మరియు తిరుమల మేడం గారి ప్రోత్సాహంతో పాఠశాలను మరింత అభివృద్ధి సాధించడానికి కృషి చేస్తామని పాఠశాలలో ఉపాధ్యాయులందరూ బాగా కష్టపడి విద్యార్థులకు అర్థమయ్యే విధంగా బోధిస్తున్నారని సమిష్టి కృషితో కోటూరు పాఠశాలను అభివృద్ధి పదంలోకి తీసుకు వెళ్తామని తెలియజేశారు గౌరవనీయులు గ్రామ పెద్దలు చంద్రమౌళి గారు ప్రసంగిస్తూ ప్రభుత్వము విద్యార్థులకు కావలసిన సౌకర్యాలను కల్పిస్తున్నదని ఉచితంగా పుస్తకాలు సన్న బియ్యంతో మధ్యాహ్నం భోజనము ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి తల్లికి వందనం కార్యక్రమం చేస్తున్నదని విద్యార్థులు తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ పాఠశాల లోనే చదివించాలని ప్రభుత్వ పాఠశాల ద్వారానే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలియజేశారు కార్యక్రమంలో పాఠశాల కమిటీ వైస్ చైర్మన్ ముబీన్ తాజ్ ఉపాధ్యాయులు భాగ్యలక్ష్మి శివకుమార్ షాహీన్ బాబు రమేష్ వెంకటరమణ ఉషారాణి తల్లిదండ్రులు పాల్గొన్నారు





