Saturday, March 21, 2026

ప్రజా వినతులను సత్వరమే పరిష్కరించాలి ప్రజా వినతులను స్వీకరిస్తున్న ..ఎమ్మెల్యే . గిత్త. జయసూర్య

నేటి సాక్షి డిసెంబర్ పాములపాడు 05:–ప్రజల నుంచి వచ్చే వినతులను స్వీకరించి ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు స్థానిక తాసిల్దార్ కార్యాలయం దగ్గర శుక్రవారం ఏర్పాటుచేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కు ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు గ్రామాలలో ఎక్కువగా రెవెన్యూ భూ సమస్యలు ఉన్నాయని అధికారులు వెంటనే వాటిని పరిష్కరించాలన్నారు ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు టి వెంకటేశ్వరరావు కౌలు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు డి సోమన్న మార్క్ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఇబ్బందుల్లో ఉన్న రైతులను వెంటనే ఆదుకోవాలని ఎమ్మెల్యేకు వినతి పత్రం అందించడం జరిగింది బి సి ఎస్ సి ఎస్ టి కాలనీలలో త్రాగునీటి పారిశుద్ధ్యం విధి దీపాలు తదితర సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు ప్రతి అధికారి ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆయన ఆదేశించారు ఈ కార్యక్రమంలో తాసిల్దార్ సుభద్రమ్మ ఏవో మహేశ్వరరెడ్డి ఎస్సై సురేష్ బాబు వివిధ శాఖల అధికారులు ప్రజలు పాల్గొన్నారుసీఎం ఆర్ ఎఫ్ చెక్కు పంపిణీ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన చెక్కును ఎమ్మెల్యే గీత జయసూర్య పంపిణీ చేశారు మండలంలోని వానాల గ్రామానికి చెందిన శమంతకమణి కి 42378 చెక్కును వేంపెంట గ్రామానికి చెందిన రొక్కం సుకుమార్ 40000 చెక్కును అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ హరినాద్ రెడ్డి నబిరసూల్ మల్లికార్జున లింగస్వామి తదితరులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News