(నేటి సాక్షి) డిసెంబర్ 05: ప్రతినిధి. శివకుమార్.ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం లో మాదిగ ఉన్నతాధికారులు, టాసా ఉపాధ్యక్షులను సన్మానించిన మాదిగ సంఘాల నాయకులు రాజేంద్రనగర్ : ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం డీన్ పీజీ స్టడీస్ గా నియమితులైన డాక్టర్ కే బీ ఈశ్వరి, తెలంగాణ అగ్రికల్చరల్ సైంటిస్ట్ అసోసియేషన్ (టాసా) ఉపాధ్యక్షులుగా నియమితులైన డాక్టర్ జె కమలాకర్ లను శుక్రవారం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు, వివిధ పార్టీలలో ఉన్న మాదిగలు కలసి సన్మానించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మాదిగ విద్యార్థులకు, ఉద్యోగులకు, అధ్యాపకులకు, కార్మికులకు ఉన్నతాధికారులు అండగా నిలవాలని కోరారు. అదే సమయంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, వివిధ పార్టీల లో ఉన్న మాదిగ నాయకులు వ్యవసాయ విశ్వవిద్యాలయం లో పని చేస్తున్న మాదిగ సామాజిక వర్గాల వారికి అండగా ఉంటారన్నారు. కే బీ ఈశ్వరి, డాక్టర్ జే కమలాకర్ ను సన్మానించిన వారిలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర నాయకులు వనం నరసింహ మాదిగ, క్యాసారం శంకర్ రావు మాదిగ, ననాగారి రామచందర్ మాదిగ, బీసీ ఎస్సీ ఎస్టీ ఐక్య వేదిక చైర్మన్ కె. హరినాథ్, కాంగ్రెస్ మైలార్ దేవుపల్లి డివిజన్ అధ్యక్షుడు నత్తి ధనుంజయ, సీనియర్ నాయకులు పలుగు చెరువు మహేష్, పి జీవన్ దాస్, అనుముల జాన్ పాల్, గోల్కొండ యాదయ్య, నవ జ్యోతి యూత్ క్లబ్ అధ్యక్షుడు మంగలారం శ్రీనివాస్, బీ ఆర్ ఎస్ నాయకులు ఎడ్ల కాడి సూర్యం, వీర్లపల్లి నవీన్ కుమార్, జర్నలిస్టు సంఘాల నాయకులు అప్పారెడ్డి గూడెం భీమయ్య, పి. వెంకటేష్, ఎం బాలసుబ్రమణ్యం, ఆరింట్ల విశాల్, సురేష్, రాధాకృష్ణ, వ్యవసాయ విశ్వవిద్యాలయం నాన్ టీచింగ్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ఎం రాజు లు పాల్గొన్నారు.





