Saturday, March 21, 2026

మదనపల్లి జిల్లా పాలనకు సర్వం సిద్ధం..అన్నమయ్య జిల్లా కలెక్టర్ మదనపల్లిలో విస్తృత పర్యటన..సబ్ కలెక్టర్ తో కలిసి బీటీ కళాశాలను మరియు వివిధ భవనాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్..

నేటి సాక్షి పత్రిక పాత్రికేయులు శర్మ, అన్నమయ్య జిల్లా, డిసెంబర్ 06 ~అన్నమయ్య జిల్లా :-: జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ శనివారం మదనపల్లి లో విస్తృతంగా పర్యటించారు. సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి తో కలిసి తొలిగా జనగణమన గేయానికి రూపుదిద్దుకున్న బీటీ కళాశాల వద్దకు విచ్చేసి తనిఖీ చేపట్టారు. లైబ్రరీ, మరియు కళాశాలలోని వివిధ భవనాలను పరిశీలించారు. అనంతరం జిఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాల, రెవిన్యూ భవనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ మదనపల్లి జిల్లా ను ప్రకటించిన నేపథ్యంలో కొత్త కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, రెవెన్యూ కార్యాలయం, ఇతర ప్రభుత్వ కార్యాలయాలను ఈ నెలాఖరు లోపు ఏర్పాటు చేసి జనవరి 1 నుంచి మదనపల్లి జిల్లా కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్టు మీడియాకు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, తహసిల్దార్ కిషోర్ కుమార్ రెడ్డి, ఎలక్షన్ డ్యూటీ రాఘవ, ఆర్ఐ బాలసుబ్రమణ్యం, రెవిన్యూ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు..—————————–

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News