నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )ఆయన నియోజకవర్గానికి ప్రథమ పౌరుడు.! కానీ..అతను చాలా సింపుల్.! అందరితో ఇట్టే కలిసిపోతారు.! ‘సమస్య’ ఎక్కడుంటే..అక్కడికి ‘పరిష్కారం’గావెళ్లి ఓదారుస్తాడు.! నిత్యం జనాల్లో ఉంటూ..వారి సాదకబాధకాల్లో మమేకమవుతాడు.! ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రొటోకాల్ ప్రకారం ‘ముఖ్య అథితే’ ఐనా..మిగితా సమయాల్లో..సాధారణ పౌరుడిగా మసలుకుంటూ తన నిరాడంబరతను చాటుకుంటూ..’మా ఎమ్మెల్యే సాబ్..’! అనిపించుకుంటాడు.సరిగ్గా ఇలాంటి చిన్న ఘటనతో మరోసారి తన సింప్లిసిటీని చాటుకున్నారు.. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్.!కోరుట్ల పట్టణంలోని కల్లూరు రోడ్‌పై, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సమీపంలో ఉన్న ‘ఎఎన్ స్పెషల్ పచ్చటకుల పాయింట్’ వద్ద శనివారం కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ సాధారణ పౌరుడిలా ‘పచ్చటుకులు’ తింటూ స్థానికులతో మమేకమయ్యారు. రోజువారీ రాజకీయ కార్యక్రమాల్లో భాగంగా ఓ సాధారణ వ్యక్తిలా ప్రజలతో కలిసిపోయి..వారితో నిల్చుని ‘పచ్చటుకులు’ తింటూ మాట్లాడిన తీరు అక్కడున్న వారిలో ప్రత్యేక ఆకర్షణగా మారింది.! అటుకులు..మిరపకాయబజ్జి..నిమ్మకాయపిండుకుని..ఈ ప్రత్యేకమైన రుచిని ఆస్వాదిస్తూ..ముచ్చటించిన వైనం ముచ్చటగొల్పిందనే చెప్పాలి.!*ప్రజల సమస్యలు వింటూ.. అటుకులు ఆస్వాదిస్తూ..*ఎమ్మెల్యేను చూసిన స్థానికులు తమ సమస్యలు, అభిప్రాయాలు ముందుకు తెచ్చి చెప్పగా, సంజయ్ ఓర్పుగా విని స్పందించారు.! చిన్న చిన్న దుకాణాల్లోకే వెళ్లి వారి పరిస్థితిని తెలుసుకోవడం ద్వారా ప్రజాప్రతినిధి ఎలా ఉండాలో మరోసారి చూపించారు.ఆయన తరచూ..నడుచుకుంటూ వెళుతూ దారినపోయే వారిని పలకరిస్తూ..రోడ్డుపక్కన దుకాణాల్లో కూర్చుని వారి వ్యాపార విషయాలు కనుక్కుంటూ..అప్పుడప్పుడు..అక్కడక్కడా హోటల్లలో కూర్చుని..జనం మధ్య చాయి తాగుతూ చర్చ పెట్టడం..రాజకీయాలు..బతుకుదెవుల గురించి డిస్కస్ చేయడం లాంటివి చేస్తూ..ప్రజల్లో తాను ‘ఓ-ఫ్రెండ్’ననే ఫీల్ కల్పిస్తుండడం ఆయన ప్రత్యేకత.! ప్రజల్లో, ప్రజల కోసం, ప్రజల మధ్యే ఉండే తన స్వభావం మరోసారి ప్రదర్శించినట్లు అక్కడి ప్రజలు అభిప్రాయపడ్డారు.! ఇది కోరుట్లలో చర్చానీయాంశమైంది.!!—–_______





