Saturday, March 21, 2026

*హోంగార్డుల సేవలు వెలకట్టలేనివి.!** జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ * ఘనంగా 63వ హోంగార్డు ఆవిర్భావ దినోత్సవం* నిస్వార్థ సేవతో పోలీసు వ్యవస్థకు బలమైన తోడ్పాటు*

నేటి సాక్షి – జగిత్యాల*( రాధారపు నర్సయ్య )జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో 63వ హోంగార్డు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పరేడ్ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరై గౌరవ వందనం స్వీకరించారు. *శాంతిభద్రతల పరిరక్షణలో హోంగార్డుల పాత్ర కీలకం*ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హోం గార్డ్స్ నేడు దేశవ్యాప్తంగా పోలీస్ శాఖకు బలమైన సహాయక శక్తిగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. ట్రాఫిక్ నియంత్రణ, ఉత్సవాలు, ఎన్నికల బందోబస్తు, నైట్ పెట్రోలింగ్, నేరాల నిరోధం వంటి కీలక బాధ్యతల్లో హోం గార్డ్స్ నిబద్ధతతో పనిచేస్తూ ప్రజల భద్రత కోసం చేస్తున్న సేవలు అపూర్వమని ఎస్పీ అభినందించారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ విధుల్లో నిజాయితీతో వ్యవహరిస్తున్న హోంగార్డుల కృషిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు.*కళాబృందం చైతన్య స్రవంతి..సైబర్ మోసాల నుండి బాలికల భద్రత వరకు అవగాహన*జిల్లాలో హోంగార్డుల కళాబృందం సామాజిక సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో విశేషపాత్ర పోషిస్తున్నదని ఎస్పీ తెలిపారు. సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలు, రోడ్డు ప్రమాదాలు, మూఢనమ్మకాల నిర్మూలన వంటి అంశాలపై కళారూపంలో ప్రజలకు చైతన్యం తీసుకువస్తున్న కళాబృందం సేవలను ఆయన మెచ్చుకున్నారు. షీ టీమ్స్‌తో కలిసి పాఠశాలలు, కళాశాలల్లో బాలికల భద్రతపై సదస్సులు నిర్వహిస్తూ మహిళల రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో విజేతగా నిలిచిన హోం గార్డులకు బహుమతులు పంపిణీ చేయడంతో పాటు, కళాబృంద సభ్యులను ఘనంగా సన్మానించారు.*సంక్షేమ చర్యలు..అలవెన్సుల పెంపు నుండి వైద్య సదుపాయాల వరకు*హోంగార్డుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన పలు చర్యలను ఈ సందర్భంగా ఎస్పీ వివరించారు. డ్యూటీ అలవెన్స్‌ను రూ.921 నుండి రూ.1,000కి పెంపు, ట్రాఫిక్ విధుల్లో 30% ప్యాల్యూషన్ హజార్డ్ అలవెన్స్, పరేడ్ అలవెన్స్‌ను రూ.100 నుండి రూ.200కి పెంపు వంటి ప్రయోజనాలు అమల్లో ఉన్నాయని తెలిపారు. అదనంగా, సహజ మరియు ప్రమాద మరణాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, వూలెన్ జాకెట్లు, రెయిన్‌కోట్లు పంపిణీ, వైద్య సేవల కోసం హెచ్‌డిఎఫ్‌సి, యాక్సిస్ బ్యాంకుల సహకారంతో ప్రత్యేక మెడికల్ బీమా పథకం అమల్లోకి వచ్చినట్లు వెల్లడించారు. కొత్త నియామకాలు, ఆరోగ్యశ్రీ సదుపాయాలు, 2 బిహెచ్కే గృహ కేటాయింపులు వంటి ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. చివరిగా, హోంగార్డులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజా భద్రత కోసం ఇదే సేవా భావంతో కొనసాగాలని ఎస్పీ కోరారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ శేషాద్రి రెడ్డి ఐపీఎస్, రిజర్వ్ సిబ్బంది, హోంగార్డులు పాల్గొన్నారు.______

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News