Saturday, March 21, 2026

*ఎన్నికల విధులు ఎన్నికల నిబంధనలకు లోబడి నిర్వర్తించాలి**

నేటి సాక్షి – భీమారం( రాధారపు నర్సయ్య )భీమారం మండలంలో పీఓల కు నిర్వహించిన ఎలక్షన్ ట్రైనింగ్ కార్యక్రమాల్లో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ట్రైనింగ్‌లో పాల్గొన్న పీఓలకు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కీలకమైన సూచనలు, మార్గదర్శకాలు అందించారు. ఎన్నికల ప్రక్రియను పూర్తిస్థాయిలో ఎన్నికల నిబంధనలు అనుసరించి నిర్వహించాలనే బాధ్యత పీఓలకు ఉందని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నోడల్ అధికారి కె. రాము, ఎంపిడివో, సంబంధిత అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు._____

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News