నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)*తిరుపతి రూరల్*భారతదేశానికి ఆత్మగా నిలిచి రాజ్యాంగాన్ని అందించిన భారతరత్న డియర్ అంబేద్కర్ వర్ధంతి తిరుపతి రూరల్ ఓటేరులో ఎస్సీ ఎస్టీ హక్కుల సంక్షేమ వేదిక జిల్లా అధ్యక్షులు సూర్య కిరణ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది ముందుగా ఓటేరు కూడలిలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా సూర్యకిరణ్ మాట్లాడుతూ ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆ మహనీయుని స్మృతికి ఘనంగా నివాళులర్పిస్తున్నట్లు నేడు సమాజంలో పేదలకు బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందంటే వారి స్వరం బలంగా వినిపిస్తుందంటే వారు తగిన రక్షణ గౌరవం పొందుతున్నారంటే దానికి కారణం డా. బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం అణగాగారిన వర్గాల్లో సాంఘిక, రాజకీయ, విద్యా చైతన్యాలను రగిలించిన పూర్తి ప్రదాత అంబేద్కరని ఆ మహనీయుని వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుందాం, రాజ్యాంగం హక్కులతోపాటు బాధ్యతలనూ పాటించడమే ఆయన మనకు ఇచ్చిన గొప్ప వరమని అన్నారు ప్రముఖ స్వాతంత్ర యోధులు రామకృష్ణారావు జ్ఞాపకార్థం ఓటేరు కూడలిలో అంబేద్కర్ విగ్రహం స్థాపించడం జరిగిందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్సీ& ఎస్టి హక్కుల సంక్షేమ వేదిక జిల్లా అధ్యక్షులు సూర్యకిరణ్, టిడిపి నాయుకులు ఇస్మాయిల్ భాయ్, టీడీపీ అధ్యక్షులు మోహన్,మహేష్, గోపాల్, మురుగయ్య, ఏసురత్నం,సుదర్శన్, రంగయ్య,సిద్ధారెడ్డి, విశ్వనాధ్ గ్రామస్థులు పాల్గొన్నారు





