Saturday, March 21, 2026

*శ్రీరామ్ లైఫ్ భీమా.. భవిష్యత్ ధీమా*• పెద్దపల్లి బ్రాంచిలో నామినికి చెక్కు అందజేత *

నేటి సాక్షి, ఎండపల్లి(రియాజ్):* జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన మాదాసు మల్లయ్య శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా డివో డాక్టర్ చంద్రమౌళి సూచనతో ఏఐపి ప్లాన్ కింద రూ.32,705 ప్రీమియంతో పాలసీ తీసుకున్నారు. కాగా పాలసీ పొందిన ఏడునెలల్లోనే ఆయన అనారోగ్యంతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో మల్లయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడానికి కంపెనీ మంజూరు చేసిన రూ.5,73,750 బీమా మొత్తానికి సంబంధించిన చెక్కును నామిని మాదాసు సునీతకు పెద్దపల్లి బ్రాంచ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కంపెనీ డీజీఎం గంగుల సతీష్ కుమార్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మల్లయ్య కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేసి.. ఇన్సూరెన్స్ భద్రత ప్రాధాన్యతను వివరించి భీమతో భవిష్యత్తుకు ధీమా లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌.ఎం వెంకట్రాజం, బ్రాంచ్ మేనేజర్ మహేందర్, సేల్స్ మేనేజర్ నరేష్, డెవలప్మెంట్ ఆఫీసర్లు చంద్రమౌళి, నరసింహం, సేల్స్ ఆఫీసర్లు సింహాచలం జగన్, మోతె వెంకటేష్, క్యాతం యోనా, సిగిరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News