Saturday, March 21, 2026

ఆపదలో ఉన్న వారికి భరోసా కలిపిస్తున్న నిజామ్** నిజామ్ సేవకు సలాం కొడుతున్న ప్రజానీకం* ఎదుటి వారికి కష్టం లేకుండా తాను ఇష్టంగా చేస్తున్న సేవలు* శాసన సభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ రాజు చేసే సేవే పరమావధిగా ముందుకు సాగుతున్న నిజామ్* కష్టాలు ఎదురొడ్డి సేవ చేయటం మంచి తనానికి మారు పేరు అన్న శాసన సభ్యులు నరేంద్ర వర్మ రాజు

*నేటి సాక్షి,బాపట్ల జిల్లా ప్రతినిధి చందోలు గ్రామంలో పేదలకు సాయం చేయాలని సంకల్పం ను శాసన సభ్యులు నరేంద్ర వర్మ రాజు చేసేసేవను ఆదర్శంగా తీసుకొని నిజామ్ ముందుకు సాగుతున్నారు.ఆయన చేసే సేవలు చూసి చందోలు గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చందోలు గ్రామంలో నజీముద్దీన్ అనే వ్యక్తి నిత్యం దర్జీ గా జీవనం సాగిస్తూ ఉండేవాడు. గత నెలలో దర్జీ కి పక్షవాతం వచ్చింది. అప్పటి నుండి తన కుటుంబ జీవనం గడవటమే కష్టంగా మారింది. వీరి విషయం తెలుసుకున్న నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు నిజామ్ వారికి వచ్చిన కష్టాన్నీ మార్చటానికి తన వంతు సాయం ఇష్టంగా చేశారు. వీరికి నెలకు సరిపడా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఆయన చేసిన సేవకు అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా నిజామ్ మాట్లాడుతూ మనం ఏ పని చేసిన కష్టం భావించకుండా ఇష్టంగా చేయాలి అన్నారు. పేదలు కష్టాలు తెలుసుకొని ఇలా సేవ చేయటం ఇక అదృష్టం అన్నారు. ఇలా ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు స్వార్థం కోసం కాకుండా నిస్వార్థంగా ప్రతి ఒక్కరూ సాయం చేయాలి అని సూచించారు. ఈ కార్యక్రమంలో చందోలు జిల్లా పరిషత్ చైర్మన్ అన్వర్ బేగ్, సలీం, సయ్యద్ జునైడ్,సలాం, అహందుల్లా, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News