నేటి సాక్షి, నారాయణపేట, డిసెంబర్ 7, పేట జిల్లాలోని ధన్వాడ మండల పరిధిలోని గ్రామపంచాయతీ కొండ్రోని పల్లి 3వ వార్డ్ భూదేవి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని గోటూరు రిటర్నింగ్ అధికారి పి. ఏ. నరసింహారెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ హెచ్ భాను ప్రకాష్ మరియు నర్సింలు గోటూరు వెంకట రాములు రాజేష్ పాల్గొన్నారు. 3 వ వార్డ్ మెంబర్ భూదేవి మాట్లాడుతూ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటానని వారి సమస్యలను తీరుస్తానని తెలియజేశారు.





