Saturday, March 21, 2026

*లింగంపేటలో చిరుత పులి సంచారం*

నేటిసాక్షి ప్రతినిధి చందుర్తి (సతీష్):చందుర్తి మండల కేంద్రంలోని లింగంపేట గ్రామంలో కల్లాల బండ గుట్ట వద్ద లండే సంతోష్ అనే రైతుకు చెందిన జెర్సీ ఆవుని పొలం వద్ద కట్టేయడంతో జెర్సీ ఆవు పైన చిరుత పులి రాత్రి సమయంలో దాడి చేసి చంపింది. అవును వరి పొలంలో కట్టేసి ఉంచామని రాత్రి సమయంలో చిరుత దాడి చేసి చంపిందని రైతు తెలిపాడు. పొలం ఓడ్ల చుట్టూ చిరుత కాలి వేలిముద్రలు కనిపించాలని తెలిపాడు. మూడు, నాలుగు, సంవత్సరాల పాటు కాపాడుకున్న ఆవును, అలాగే రెండు నెలల పాలు తాగే లేగ దూడ కూడా చనిపోయిన ఆవుకు ఉన్నదని రైతు తెలిపాడు. అలాగే దీనికి నష్టపరిహారం చెల్లించాలని ఫారెస్ట్ అధికారులకు విన్నపించాడు. చిరుత చంపడంతో రైతు ఆవేదనకు గురయ్యాడు. కల్లాల బండ గుట్ట ప్రాంతంలో, చిరుత పులి సంచరిస్తుందని ఆ ప్రాంత రైతులు భయాందోళనకు గురవుతున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News