Saturday, March 21, 2026

ఉద్య‌మ స్ఫూర్తితో ` కోటి సంతకాల` కార్యక్రమ నిర్వహణ.. కోటిరెడ్డి మాధవరెడ్డిఈ కూటమి ప్రభుత్వం వైద్య విద్యార్థులు కన్న కలలను సమాధి చేస్తోందని విమర్శలు..

నేటి సాక్షి పత్రిక పాత్రికేయులు శర్మ, అన్నమయ్య జిల్లా, డిసెంబర్ 07 ~అన్నమయ్య జిల్లా :-: స్థానిక నియోజకవర్గ పరిధిలోని ములకలచెరువు మండల కేంద్రమైన స్థానిక నాయునిచెరువుపల్లి రోడ్డులోని వినాయక నగర్ ప్రాంతంలో తంబళ్లపల్లి శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ఆదేశాల మేరకు ములకలచెరువు మండల కన్వీనర్ కోటిరెడ్డి మాధవరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తలపెట్టిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ రచ్చబండ మరియు కోటి సంతకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవరెడ్డి మాట్లాడుతూ విద్యను అభ్యసించి, ప్రజలకు వైద్య సేవలు అందించాలనుకుంటున్న పేద విద్యార్థుల స్వప్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అసమర్థత నిర్ణయం పట్ల వైద్య విద్యార్థులు కన్న ఆశలను సమాధి చేస్తోందని మాధవరెడ్డి దుయ్యబట్టారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరించేందుకు చంద్రబాబు సర్కారు తీసుకున్న నిర్ణయంపై మాధవరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టిన ఎడాదిన్నర పాలనలోనే రాష్ట్ర ప్రజల నుంచి వ్యతిరేకత మూటకట్టుకుందని మాధవరెడ్డి విమర్శించారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వలన కలిగే నష్టాలను ప్రజలకు వివరిస్తూ సంత‌కాలు సేకరిస్తున్నామని ఇందులో భాగంగా కోటి సంతకాల సేకరణను ఉద్యమ స్ఫూర్తితో నిర్వహిస్తున్నామని దీనికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందని మాధవ రెడ్డి అన్నారు. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తే పేద విద్యార్థులకు మెడికల్ విద్య దూరమవుతుంది. అలా కాకూడదనే ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి వైయస్ జగన్ తలపెట్టిన కార్యక్రమానికి మద్దతిస్తున్నారని మాజీ సింగల్ విండో చైర్మన్ సదాశివప్ప చెప్పుకొచ్చారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ విలువ ఏంటో ఇప్పుడు ప్రజలందరికీ తెలుస్తావుందని జగన్ తెచ్చిన మంచి పథకాలన్నీ కూటమి నేతలు నిర్వీర్యం చేశారని సదాశివప్ప విమర్శించారు. రాష్ట్రంలో ఏ వర్గం ప్రజలు సంతోషంగా లేరు. రాష్ట్ర ప్రజలు అందరూ జగన్ వెనకాలే ఉన్నారు. కేసులు పెట్టి భయపెట్టే ప్రయత్నం చేసినా ఎవరూ భయపడటం లేదు. కూటమి నేతలు చేసిన అబద్ధ ప్రచారాలు ముందు మనం చేసిన అభివృద్ధి కనపడలేదు. కానీ ప్రజలకు ఇప్పుడు బాగా అర్థమవుతోందని సదాశివప్ప తెలిపారు. బూత్ కమిటీ అధ్యక్షుడు బోనాల చాంద్ భాషా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దుర్మార్గమైనది. జగన్ మెడికల్ కాలేజీలు పెడితే కూటమి నేతలు డబ్బులు దండుకోవటం కోసం ప్రైవేట్ పరం చేస్తున్నారు. టీడీపీ కి ఓటు వేసిన వారు కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. కోటి సంతకాల సేకరణ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతమైంది. కూటమి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టాక ఎక్కడ కూడా అభివృద్ధనేది ఎక్కడా జరగలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని చాంద్ భాషా విమర్శించారు. రూ. 6వేల కోట్లు ఖర్చు పెడితే మెడికల్ కాలేజీలు పూర్తవుతాయి. మంచి డాక్టర్లు వస్తే మంచి హాస్పిటల్ లు వస్తాయని భావించి మెడికల్ కాలేజీ లను తీసుకొస్తే ఈ కూటమి ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేస్తూ మరొకరికి కట్టబెట్టాలని చూస్తుందని వైసీపీ శ్రేణులు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ మాధవరెడ్డి, మండల ప్రత్యేక ఆహ్వానితుడు సిద్ధారెడ్డి, సింగల్ విండో మాజీ అధ్యక్షుడు సదాశివప్ప, వైసీపీ ముఖ్య నాయకుడు సాయిలీల ఉమా మహేష్, వైస్ ఎంపీపీ మల్లికార్జున, ములకల చెరువు మండల బూత్ కమిటీ అధ్యక్షుడు బోనాల చాంద్ భాష, సర్పంచ్ రామనాథం, ఆన్సర్ భాష, బావయ్య, నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షుడు సయ్యద్ భాష, రెడ్డి మౌలాలి, సోషల్ మీడియా కన్వీనర్ నాగేంద్ర, కిషోర్, విష్ణువర్ధన్, ఇంతియాజ్, రఫీ, బాబాజీ, మరియు ప్రజలు పాల్గొన్నారు..—————————–

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News