Saturday, March 21, 2026

*ఒక్కఛాన్స్ ప్లీజ్! – పంచాయతీ ఎన్నికల్లో యువగళం* పంచాయతీ ఎన్నికల పోరులో యువతీయువకులు పోటీ కొత్త ఆలోచనలతో గ్రామభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో బరిలో నిలిచిన యువతయువత – భాగస్వామ్యం పెరిగితేనే పల్లెల్లో సమస్యల పరిష్కారమని ప్రచారం.

నేటి సాక్షి నల్లబెల్లి ప్రతినిధి డిసెంబర్ 08 : నల్లబెల్లి మండలంలో ఎన్నికల ప్రచార సందడి మొదలైంది. సాధారణంగా ఎన్నికల పోరులో పెద్దలు, అనుభవజ్ఞులకే పరిమతమయ్యే సర్పంచి పదవులకు ఈసారి యువతీయువకులు అధిక సంఖ్యలో పోటీపడుతున్నారు. ప్రస్తుతం గతానికి భిన్నంగా యువత పంచాయతీ ఎన్నికలో పోటీకి ఆసక్తి చూపుతున్నారు. రాజకీయాల్లో ఉన్నత పదవులు చేపట్టాడానికి తొలిమెట్టుగా భావిస్తున్నారు. పాత విధానాలను పక్కనపెట్టి గ్రామాభివృద్ధికి కొత్త ఆలోచనలతో ముందుకు సాగాలనే ఉద్దేశంతో యువతరం బరిలో నిలిచింది. *_చదువుకున్నవారే రాత మార్చుతారని_* : సాధారణంగా ఓటు వేయటానికి తప్ప పోటీకి యువత ముందుకొచ్చిన దాఖలాలు చాలా తక్కువ. కానీ ఈసారి గతానికి భిన్నంగా పల్లె పోరుకు యువత ఆసక్తి చూపుతోంది. రాజకీయాల్లో ఉన్నత పదవులు చేపట్టేందుకు స్థానిక ఎన్నికలను తొలిమెట్టుగా భావిస్తోంది.డిగ్రీలు చదివిన విద్యార్థులతో పాటు సామాజిక సేవ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్న యువత పోటీ చేసేందుకు ముందుకు రావటం రాజకీయ మార్పునకు నాందిగా నిలుస్తోంది. ఎక్కువగా విద్యావంతులను సర్పంచులుగా ఎన్నుకుంటే గ్రామ పంచాయతీల రాత మారుతుందని యువత చేస్తున్న ప్రచారం ఓటర్లను ఆకట్టుకుంటోంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News