Saturday, March 21, 2026

*చర్లపల్లి లో ఆర్టీసీ బస్సులు ఆపుతాలేరు!** రిక్వెస్ట్ బస్ స్టాప్ ఎత్తివేతపై గ్రామస్థుల ఆందోళన* అధికారిక బస్సు స్టాప్ ఏర్పాటుకు డిమాండ్* ఎన్నికల కోడ్ తో నిరసన వాయిదా!*

నేటి సాక్షి, ఎండపల్లి (రియాజ్):* రానురాను ఆర్టీసీ బస్సు ప్రయాణం ప్రజలకు అందనంత దూరంగా మారుతోంది. నాడు చెయ్యి ఎత్తిన చోట బస్సు ఆపబడును అనే పరిస్థితి నుండి నేడు చెయ్యి ఎత్తిన కూడా ఆపలేని పరిస్థితి నెలకుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మీ పథకం మహిళలకు ఉచిత ప్రయాణం అమలుతో ప్రయాణికులు అధికంగా బస్సులను ఆశ్రయిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం లోని చర్లపల్లి రిక్వెస్ట్ బస్ స్టాప్ పై ఆర్టీసీ అధికారులు తీసుకున్న నిర్ణయంపై గ్రామస్థులు ఆగ్రహాం వ్యక్తం చేస్తూ ఆందోళనకు సిద్ధం అవుతున్నారు. ఊరు పుట్టిన నుండి ఉన్న రిక్వెస్ట్ బస్ స్టాప్ లో గత కొన్ని రోజులుగా బస్సులు ఆపకపోవడంతో సమస్య తలెత్తింది. జగిత్యాల-ధర్మారం రూట్లో చర్లపల్లి మీదుగా రోజుకు సుమారు ప్రతి 40 నిమిషాలకు ఒక్క బస్సు చొప్పున 6 బస్సులు నడుస్తున్నాయి. నాటి నుండే చర్లపల్లి గ్రామంలో రిక్వెస్ట్ బస్ స్టాప్ తోనే బస్సులు ఆగుతుండడం, ముందు స్టేజ్ టిక్కెట్ విధించిన సరేనని అధిక ఛార్జీలు చెల్లించి మరి బస్సులోనే ప్రయాణిస్తున్నారు. గత కొద్దిరోజులుగా బస్సులు చర్లపల్లి లో ఆపాకపోవడంతో ప్రయాణికులు డ్రైవర్, కండక్టర్ లను సంప్రదించగా మీ బస్సు స్టాప్ ఎత్తి వేశారు మీరు ముందు స్టేజ్ లలో వెళ్లి ప్రయాణించండి అని సమాధానం ఇచ్చారు. దీనిపై పలుమార్లు డిపో మేనేజర్ కు విన్నవించిన స్పందించక పోవడంతో గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. మా ఊరు మీదుగా బస్సులు వెళ్లినప్పుడు ఎందుకు ఎలా ఆపారో చూద్దాం అని నిరసనకు సిద్దమైన.. ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాయిదా వేసుకున్నట్టు వినికిడి. ఈ సమస్య పెద్దది కాకముందే ఆర్టీసీ అధికారులు స్పందించి చర్లపల్లి గ్రామానికి అధికారిక బస్సు స్టాప్ ఏర్పాటు చేసి ఎప్పటిలా బస్సులు ఆపాలని, దీని పరిష్కారానికి మంత్రివర్యులు చొరవ చూపాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News