Saturday, March 21, 2026

వైఎస్ఆర్‌సీపీ బీసీ నాయకుడు విజయ భాస్కర్‌ పై దాడి హేయమైన చర్య..పరామర్శించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా అధ్యక్షుడు, శాసనసభ్యులు పరస్పర దాడులు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం..

నేటి సాక్షి పత్రిక పాత్రికేయులు శర్మ, అన్నమయ్య జిల్లా, డిసెంబర్ 08 ~అన్నమయ్య జిల్లా :-: కూటమి ప్రభుత్వంలో టీడీపీ నాయకులు బరితెగించి పోతున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల లక్ష్యంగా వారిపై దాడులకు తెగబడుతున్నారని ఇలాంటి సంస్కృతి ఎన్నడూ చూడలేదని ఇలా ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం సంస్కృతి కాదని వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య శ్రేణులు హితువు పలికారు. టీడీపీ వర్గీయుల దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స నంతరం కోలుకుంటున్న వైఎస్ఆర్‌సీపీ బీసీ నాయకుడు విజయ భాస్కర్‌ను సోమవారం వైఎస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాయచోటి మాజీ శాసనసభ్యులు గడికోట శ్రీకాంత్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు, రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమరనాథ్ రెడ్డి మరియు వైసీపీ శ్రేణులు ఏకమై రాయచోటిలోని విజయభాస్కర్ స్వగృహానికెళ్లి పరామర్శించారు. దాడి జరిగిన పరిణామాలను వివరంగా అడిగి తెలుసుకున్నారు. విజయభాస్కర్ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన వైసీపీ నేతలుగడికోట శ్రీకాంత్ రెడ్డి, ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి మాట్లాడుతూ విజయభాస్కర్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయనపై దాడి హేయమైన చర్యనని ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమైందన్నారు. ఇలాంటి రాజకీయ హింసను మరింతగా టీడీపీ నాయకత్వం ప్రోత్సహిస్తావుందని ఇది సరైన పద్ధతి కాదని వీటిని కూటమి అరికట్టాలని వారు కోరారు. ఎలాంటి పరిస్థితులలోనైనా కార్యకర్తలకు ఎల్లవేళలా వైఎస్ఆర్‌సీపీ అండగా నిలుస్తుందని మీకు అండగా మేమున్నామంటూ భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగాలని విజయభాస్కర్‌కు వైసీపీ నేతలు భరోసా ఇచ్చారు. ఈ పరామర్శ కార్యక్రమం లో మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష, వైఎస్ఆర్‌సీపీ పట్టణ అధ్యక్షుడు నవాజ్, వైఎస్ఆర్ సీపీ మైనార్టీ జిల్లా అధ్యక్షుడు బేపారి మహమ్మద్ ఖాన్, మాజీ ఎంపీపీ అంపాబత్తిన రెడ్డయ్య, వైసీపీ శ్రేణులు కొలిమి చాన్ బాష, షబ్బీర్, మహేష్ రెడ్డి, ఆల్తాఫ్, సుగవాసి శ్యామ్, మేధావుల ఫోరమ్ కన్వీనర్ జానం రవీంద్ర యాదవ్, కొత్తిమీర ప్రసాద్, జెసిఎస్ కన్వీనర్ వడ్డీ వెంకట రమణా రెడ్డి, ట్రేడ్ యూనియన్ చిన్న సంజీవయ్య, వాల్మీకి సంఘ జిల్లా అధ్యక్షుడు గువ్వల బుజ్జిబాబు, బీసీ సెల్ కన్వీనర్ నాగరాజు యాదవ్, పేయల శివశంకర యాదవ్, మైనారిటీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నవాజ్ క్రిష్, జిల్లా మైనారిటీ కార్యదర్శి నియాజ్, సోషల్ మీడియా జిల్లా అధ్యక్షుడు నరేష్ స్వామి, బీసీ యువజన నాయకుడు రమేష్, శాలివాహన సంఘ జిల్లా అధ్యక్షుడు నాగేంద్ర, సురేష్ రెడ్డి, గజేంద్రరెడ్డి, బార్ సిద్దారెడ్డి, అమీర్, మల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు..~~~~~~~~~~~~~~~~~~

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News