Saturday, March 21, 2026

సిబ్యాల విజయభాస్కర్ పై జరిగిన దాడి ఘటనపై జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు..

నేటి సాక్షి పత్రిక పాత్రికేయులు శర్మ, అన్నమయ్య జిల్లా, డిసెంబర్ 08 ~అన్నమయ్య జిల్లా :-: రాయచోటి లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి విజయ్ భాస్కర్ ను సోమవారం వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు అమర్ నాథ్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పరామర్శించిన అనంతరం ఆయనపై జరిగిన దాడి ఘటనపై అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి కు ఫిర్యాదు చేసేందుకు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. ఈ మేరకు సిబ్యాల విజయభాస్కర్ పై జరిగిన దాడి ఘటనను జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి దృష్టికి తీసుకెళ్లారు. సిబ్యాల విజయ్ భాస్కర్ పై దాడి చేసిన వారిని గుర్తించి తక్షణమే శిక్షించాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు, రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమరనాధరెడ్డి మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణ కు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ పత్రాలను ఈ నెల 10న నియోజకవర్గాల నుంచి జెండా ఊపి జిల్లా కేంద్రానికి తరలిస్తున్నామని 15న జిల్లా నుంచి విజయవాడకు పంపిస్తున్నామని 17న గవర్నర్ ను కలిసి వినతిపత్రంతో పాటుగా కోటి సంతకాల పత్రాలు సమర్పిస్తామని ఇదే విషయంలో భాగంగా సోమవారం జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశామని ఆకేపాటి అమరనాథ్ రెడ్డి తెలిపారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మాట్లాడుతూ సిబ్యాల విజయభాస్కర్ పై జరిగిన దాడి జరగడం బాధాకరమని ఆయనపై దాడి చేసిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించమని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని మళ్లీ భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా చూస్తామని వైసీపీ శ్రేణులకు హామీ ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకుడు విజయభాస్కర్ పై దాడి పాశవికమని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. నియోజకవర్గ ప్రజలను భయభ్రాంతులకు గురిచేయాలనే తీరును కూటమి నేతలు అవలంబిస్తున్నారని వీటి పై జిల్లా ఎస్పీని కలిసి ఆయనకు వివరించామని వ్యక్తిగత కారణాలలేన్నున్నా ప్రశ్నించే వ్యక్తులపై విచక్షణ రహితంగా దాడులకు పాల్పడటం తప్పని విజయకుమార్ పై దాడి చేసిన వారిని గుర్తించి తగు చర్యలు చేపట్టాలని ఎస్పీని కోరినట్టు గడికోట శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. గత 15 సంవత్సరాలుగా దురదృష్టకరమైన సంఘటనలు జరగకుండా శాంతిభద్రతలను కాపాడేవిదంగా పనిచేశామని ఈ 18 నెలల్లో బీసీ నేతలు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేశ్వర్లు, లక్కిరెడ్డిపల్లి జడ్పీటీసీ రమాదేవి, మాజీ ఎంపీపీ రెడ్డేయ్య ఇలా ప్రజా ప్రతినిధుల ఇళ్లపై దాడులు జరిగిన ఇంతవరకు నిందితుల అరెస్ట్ కాలేదని వాపోయారు. రాజకీయంగా వర్గాన్ని లక్ష్యంగా చేసుకోని దాడులకు పాల్పడుతున్నప్పుడు శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయని ఎస్పీకి వివరించామని వ్యవస్థలపై గౌరవం ఉందని అలాంటి నమ్మకం కోల్పోయే పరిస్థితి వస్తే మేము కూడా స్పందించాల్సి వస్తుందని గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఈ వ్యాఖ్యలపై ఎస్పీ వివరణ ఇస్తూ కొంతమందిని గుర్తించి అదుపులోకి తీసుకున్నామని మరి కొంతమందిని గుర్తించే దాంట్లో ఉన్నామని వాళ్ళను కూడా గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. ముసుగులేసుకోని దాడులు చేయడమేంటి.. ——————————————–ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా. ఇలాగా దాడులు చేస్తే వేరే పరిణామాలకు దారితీస్తుంది. తప్పు ఎవరు చేసిన ప్రశ్నించడం ప్రజాస్వామ్యం కల్పించిన హక్కు, అందుకు ఖండించాలి. లేదా సమాధనం చేప్పుకోవాలి. అంతేకానీ. మాస్కు లేసుకోని, ముసుగులేసుకోని భౌతికదాడులకు పాల్పడుతున్న వారి బండారం బయటబేట్టాలని, వారిపై కఠిన చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు వచ్చే పట్టాలని పలువురు వైసీపీ శ్రేణులు ఎస్పీని కోరారు. ~~~~~~~~~~~~~~~~~~

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News