Saturday, March 21, 2026

ప్రజల సమస్యల పరిష్కారమే పోలీసుల ప్రథమ కర్తవ్యం.. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్నేటి సాక్షి పత్రిక పాత్రికేయులు శర్మ, అన్నమయ్య జిల్లా, డిసెంబర్ 08 ~అన్నమయ్య జిల్లా :-: ప్రజల సమస్యల పట్ల పోలీసులు ఎల్లప్పుడూ జవాబుదారీతనంతో మెలిగి, బాధితులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా పనిచేయాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ స్పష్టం చేశారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)” కార్యక్రమంలో ఎస్పీ ధీరజ్ కనుబిల్లి స్వయంగా పాల్గొని జిల్లా నలుమూలల నుండి వచ్చిన ఫిర్యాదుదారులతో ముఖాముఖి మాట్లాడారు. భూ వివాదాలు, కుటుంబ కలహాలు, సైబర్ నేరాలు మరియు వేధింపులపై వచ్చిన అర్జీలను ఎస్పీ క్షుణ్ణంగా పరిశీలించారు. బాధితుల సమస్యలను ఓపికగా విని వాళ్లు విన్నవించిన ఫిర్యాదులపై తక్షణమే ఆయా సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు ఫోన్ చేసి వివరాలను రాబట్టారు. క్షేత్ర స్థాయిలో వాస్తవాలను విచారించి తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అర్జీదారులకు న్యాయం జరిగినట్లు నిర్ధారించుకోవడమే కాకుండా, తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదికను ప్రధాన కార్యాలయానికి పంపాలని అధికారులకు సూచించారు. అక్రమ వడ్డీ వ్యాపారాలు, ఆన్‌లైన్ మోసాలు మరియు మహిళలపై జరుగుతున్న వేధింపుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పునరుద్ఘాటించారు..~~~~~~~~~~~~~~~~~~

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News