Saturday, March 21, 2026

డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమానికి ప్రజల అనూహ్య స్పందన పేట జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్

నేటి సాక్షి, నారాయణపేట,డిసెంబర్ 8,నారాయణపేట జిల్లా ఎస్పీ శ్రీ డాక్టర్ వినీత్ ఐపీఎస్ గారి* ఆధ్వర్యంలో నిర్వహించిన “డయల్ యువర్ ఎస్పీ” కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. మొత్తం 23 మంది ప్రజలు ఫోన్ల ద్వారా ఎస్పీ గారిని నేరుగా సంప్రదించి, వివిధ సమస్యలు, ఫిర్యాదులు, సలహాలు మరియు సూచనలు అందించారు.వచ్చిన కాల్స్ లో ఎక్కువగా భూ తగాదాలకు సంబంధించినవి కాగా మరియు టౌన్ లో ట్రాఫిక్ సిగ్నల్స్ సత్యనారాయణ కమాన్ వైపు వెళ్లే రూట్లో సమయం పెంచాలని, టౌన్ లో గూడ్స్ వాహనాలు రోడ్లపై ఎక్కువ సమయం నిలుపుతున్నారని, గ్రామపంచాయతీ ఎన్నికలలో నామినేషన్స్ విత్ డ్రా చేసుకోవాలని బయటపెడుతున్నారని పోలీసు రక్షణ కావాలని, ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే రూట్లో లైటింగ్ లేదు అని, ప్రాపర్టీ దొంగ తనం కేసులలో రికవరీ చేయలేదు అని అట్టి ఫిర్యాదులను ఎస్పీ గారు విని వాటినీ చట్ట ప్రకారం తప్పకుండా పరిష్కరిస్తామని వెంటనే సంబంధిత అధికారులకు స్వయంగా తెలియచేసి, అట్టి సమస్యలను సంబంధిత అధికారులు దర్యాప్తు చేస్తూ వాటిని పరిష్కరిస్తూ ఎస్పీ కార్యాలయానికి రిపోర్టు పంపాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అలాగే, కొన్ని సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకున్నారు.డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం ద్వారా ప్రజలకు పోలీస్ వ్యవస్థకు మరింత చేరువ అవ్వడానికి అవకాశం కలుగుతోందని, ప్రజల నమ్మకం పెరుగుతోందని ఎస్పీ తెలిపారు.జిల్లా ప్రజలు ఏవైనా సమస్యలు, ఫిర్యాదులు ఉంటే నేరుగా పోలీస్ అధికారులను సంప్రదించవచ్చని, పారదర్శకంగా పని చేయడం పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని ఎస్పీ పేర్కొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News