Friday, March 20, 2026

వైసీపీ కార్యకర్త కోసం ఆసుపత్రికి..పాము కరిచి చికిత్స పొందుతున్న అభిమాన కార్యకర్త కోసం తపించిన మదనపల్లి వైసీపీ సమన్వయకర్త

నేటి సాక్షి పత్రిక పాత్రికేయులు శర్మ, అన్నమయ్య జిల్లా, డిసెంబర్ 08 ~అన్నమయ్య జిల్లా :-: స్థానిక నియోజకవర్గ పరిధిలోని మదనపల్లి మండల కేంద్రమైన కొత్తపల్లి గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు నాగార్జున నాయుడు పొలం పనులు నిమగ్నమై ఉండగా అకస్మాత్తుగా పాముకాటుకు గురయ్యాడు. క్షణాల్లో గుర్తించిన పాలేరులు, కుటుంబ సభ్యులు హుటాహుటిన మదనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఐసీయూ కు చేర్చారు. అక్కడ చికిత్స పొందుతున్నారు. స్థానిక వైసిపి శ్రేణులతో విషయం తెలుసుకున్న మదనపల్లి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ హుటా హుటిన ఆస్పత్రి వద్దకు చేరుకొని హాస్పిటల్ కి చేరుకొని ఐసీయూ వార్డు లో చికిత్స పొందుతున్న నాగార్జున నాయుడుని పరామర్శించారు. ఆరోగ్యం పై వైద్యులను అడిగి విచారించారు. మెరుగైన వైద్యమందించాలని సూచించారు. చురుగ్గా పాల్గొనాలని నిస్సార్ అహ్మద్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నాగార్జున నాయుడు ను పరామర్శించేందుకు మిలట్రీ మల్లికార్జున్ రెడ్డి, ఈశ్వర్ నాయక్, చరణ్, శ్రీకాంత్ చలపతి తదితరులు నిస్సార్ అహ్మద్ వెంటే పాల్గొని పరామర్శించారు.~~~~~~~~~~~~~~~~~~

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News