నేటి సాక్షి,నారాయణపేట డిసెంబర్ 8,కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి చెందుతాయని నారాయణపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కే ప్రశాంత్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం తీలేరు గ్రామంలో పలు వార్డులలో తిరిగి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి రాములుకే ఓటు వేయాలంటూ ఆయన ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బజారప్ప వెంకట్రెడ్డి ప్రభాకరు పి రవి వెంకటేష్ రాములు అన్ని రెడ్డి ఆంజనేయులు ,మాజీ ఎంపీటీసీ సునీత ,మాజీ సర్పంచ్ రేవతమ్మ తదితరులు పాల్గొన్నారు.





