నేటి సాక్షి పత్రిక పాత్రికేయులు శర్మ, అన్నమయ్య జిల్లా, డిసెంబర్ 09 ~అన్నమయ్య జిల్లా :-: గుక్కెడు నీళ్లు దొరకని గ్రామాలు ఉన్నాయేమో కానీ బెల్టు షాపులు లేని గ్రామాలు లేవు. గ్రామాల్లోని బెల్టుషాపుల్లో యథేచ్ఛగా మద్యం అమ్మకాలు బహిరంగంగానే సాగుతున్నాయి. పల్లెల్లో మద్యం ఏరులైపారుతోంది. వైన్ షాపులకు దీటుగా గ్రామాల్లో కిరాణా షాపులు పర్మిట్‌రూమ్‌లు, బార్‌లను తలపిస్తున్నాయి. పల్లెలు, పట్నాలు తేడా లేకుండా విచ్చలవిడిగా బెల్టుషాపుల్లో మద్యం విక్రయాలు సాగుతున్నాయి. అధికారిక దుకాణాల కంటే బెల్టుషాపుల్లోనే అమ్మకాలు ఎక్కువగా సాగుతున్నాయి. ఇంత జరుగుతున్నా అధికారులకు మాత్రం బెల్టు దుకాణాలు కనిపించటం లేదు. అధికారుల నిర్లక్ష్య వైఖరి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోంది. గ్రామాల్లో బెల్టు దుకాణాల అమ్మకాలే ఎక్కువ. మద్యం దుకాణదారులు కూడా వీటిని ప్రోత్సాహిస్తూనే అమ్మకాలు పెంచుకుంటున్నారు. వీటికి అనుమతులు లేకున్నా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోరు. ప్రభుత్వానికి మద్యం విక్రయాల ద్వారా ఆదాయం రావాలన్నా, అధికారులకు ముడుపులు అందాలన్న ఆలోచనతో బెల్టు దుకాణాలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. సిండికేట్ కాకపోయినా బెల్టు దుకాణదారులు మాత్రం అదనపు వసూళ్ల దందా కొనసాగిస్తున్నారు. క్వార్టర్‌కు రూ.20, ఫుల్‌బాటిల్‌కు రూ.80 వరకు దోచుకుంటూ దండుకుంటున్నారు. వాహనాల తనిఖీ, నగదు రవాణాపై దృష్టి సారిస్తున్న అధికారులు బెల్టు దుకాణాలకు మద్యం సరఫరాపై ఎందుకు ఫోకస్ పెట్టడం లేదో అర్థం కావడం లేదు. పల్లెల్లో బెల్టు దుకాణాలు విచ్చలవిడిగా మద్యం విక్రయాలు సాగిస్తున్నా కనీసం ఆ ఆ శాఖ అధికారులు కన్నెత్తి చూడకపోవడంతో అధికారుల ఉదాసీనతకు అద్దం పడుతోందని గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసలు అధికారుల కనుసన్నల్లోనే బెల్టు దుకాణాలు సైతం కొనసాగుతున్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తూ గ్రామాల్లో నిబంధనలకు విరుద్ధంగా బెల్టు షాపులు పల్లెలు, పట్టణాలనే తేడా లేకుండా మద్యం ఏరులై పారుతున్నా ఎక్సైజ్ శాఖ అధికారులు అటు వైపు కన్నెత్తి చూడకుండా వ్యవవహరిస్తున్నారని పల్లె ప్రజలంటున్నారు. తాగేందుకు బుక్కెడు నీరు లేని పల్లెలు ఉన్నాయి. కానీ మందు దొరకని పల్లెలు మాత్రం ఒక్కటి లేదు. పల్లెల్లో బెల్ట్ షాపుల దందా జోరుగా సాగుతోంది. పల్లెలు, మారుమూల గ్రామాలు మత్తులో జోగుతున్నాయి. గ్రామాల్లో పుట్టగొడుగుల్లా బెల్టు దుకాణాలు వెలుస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా బెల్టు షాపులు ఏర్పాటు చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. అనేక మంది బెల్టు షాప్‌లో మద్యం కొనుగోలు చేసి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. అప్పులు చేసి తాగడంతో కుటుంబాలు వీధి పాలవుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పచ్చని సంసారాల్లో మద్యం చిచ్చు పెడుతోందని గ్రామ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.బెల్టు షాపుల వారు అదనంగా..______________________బెల్టు షాపుల వాళ్లు అదనంగా మరో రూ.20 పెంచి కస్టమర్లకు విక్రయిస్తున్నారు. విచ్చలవిడిగా పెరుగుతున్న బెల్ట్ షాపు నిర్వాహకులు ఎవరికి నచ్చిన విధంగా వారు ధర నిర్ణయించుకొని క్వార్టర్ పై 30/-రూ. లు, హాఫ్ పై 60/- రూ. లు ఫుల్ పై కనీసం 120/- రూ. లు బీర్ పై 50/-రూ.లు అదనంగా వసూలు చేస్తున్నారు. వైన్ షాప్ లో ఉండే ప్రతి ఒక బ్రాండ్ మద్యం బెల్ట్ షాపుల్లో ఉండటం గమనార్హం. ప్రతి ఒక్క గ్రామంలో గల్లీ గల్లీకి బెల్ట్ షాపులు వెలవటంలో ఆంతర్యమేంటో అర్థం కాని పరిస్థితి. పుట్టగొడుగుల్లా బెల్ట్ దుకాణాలు వెలుస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా బెల్టు షాపులు ఏర్పాటు చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. అధిక ధరలే కాకుండా ఖాతా బుక్ పెట్టి వడ్డీ వసూలు కూడా చేస్తున్నారని వారి గ్రామస్తులు వాపోతున్నారు. దీని వలన అనేక మంది బెల్ట్ షాపుల్లో మద్యం కొనుగోలు చేసి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. అప్పులు చేసి తాగడం తో కాపురాలు వీధి పాలవుతున్నాయి. ఇప్పటికైనా ఎక్సైజ్ శాఖ అధికారులు మామూలు మత్తును వీడి గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ మద్యం విక్రయాలను అరికట్టాలని అనధికారంగా వెలసిన బెల్ట్ షాపుల పై చర్యలు తీసుకొని వాటి మూసివేత దిశగా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. తాజాగా తంబళ్లపల్లి నియోజకవర్గ పరిధిలోని పెద్ద తిప్ప సముద్రం మండల కేంద్రమైన స్థానిక పోలీస్ స్టేషన్ లో నూతనంగా బాధ్యతలు చేపట్టిన పరమేశ్వర్ నాయక్ తొలి రోజే తన పంజా విసిరారు. గ్రామస్తులిచ్చిన సమాచార మేరకు ఆయన సిబ్బందితో రంగసముద్రం గ్రామానికెళ్లి బెల్టు షాపు లో సోదాలు నిర్వహించి 180 మందు బాటిళ్లను స్వాధీనపరుచుకున్నారు. సివిల్ పోలీసులకు దొరికే మద్యం – ఎక్సజ్ పోలీసులకు ఎందుకు దొరకదు..________________________సివిల్ పోలీసులకు దొరికే మద్యం ఎక్సజ్ పోలీసులకు ఎందుకు దొరకదని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. బెల్టుషాపుల నుంచి ఎస్సైజ్ పోలీసులకు భారీగానే ముడుపులు అందుతున్నాయని అందుకనే ఆ శాఖ పోలీస్ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని 3 నెలలకు ముందు రాష్ట్రాన్ని కుదిపేసిన నకిలీ మద్యం తయారీ వ్యవహారం ఈ నియోజకవర్గ పరిధిలోని ములకలచెరువు మండల కేంద్రంలో వెలుగు చూసింది. ములకలచెరువులో నకిలీ మద్యం తయారీనీ సివిల్ పోలీసుల సహకారంతో ఎక్సైజ్ శాఖ అధికారులు గుట్టు రట్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నకిలీ మద్యం తయారీకి మూల కారకుడైన తంబళ్లపల్లి తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత దాసరపల్లి జయచంద్రారెడ్డి ఆయన బామ్మర్ది గిరిధర్ రెడ్డి పర్యవేక్షణలో రోజుకు దాదాపుగా 20వేల నకిలీ మద్యం తయారైంది. ఇక్కడ తయారైన నకిలీ మద్యం మూడు పువ్వులు ఆరు కాయలు లాగా రాష్ట్ర ప్రభుత్వానికి గండి కొడుతూ ఇతర జిల్లాలకు సరఫరా చేసి జేబులు నింపుకున్నారు. ఈ భారీ డంప్ బయటపడుతుందని గ్రహించి మూల కారకులైన సూత్ర, పాత్రధారులు దాసరపల్లి జయచంద్రారెడ్డి ఆయన బావమరిది గిరిధర్ రెడ్డి దేశాన్ని విడిచి పారిపోయారు. అప్పటి నుంచి ఇప్పటివరకు వారి జాడ తెలియడం లేదు. పోలీసులేమో వారిపై నిఘా ఉంచారు. కానీ వాళ్లు విదేశాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. కానీ భారత్ కు రప్పించే ప్రయత్నం చేయటం లేదు. సామాన్యులపై కొరడా విధించే అధికారులు అలాంటి వారిని ఎందుకు శిక్షించలేదనే వాదన వినిపిస్తోంది. రాష్ట్రానే కుదిపేసిన ఘటన మర్చిపోక ముందే మళ్లీ గ్రామాల్లో మద్యం విక్రయాలు పంజా విసురుతున్నాయి. పచ్చని సంసారాల్లో మద్యం చిచ్చుపెట్టి వాళ్ల జీవితాలతో చలగాటమాడు తున్నాయి. తంబళ్లపల్లి నియోజకవర్గ పరిధిలోని బి. కొత్తకోట, పిటియం, ములకలచేరువు, తంబల్లపల్లి, పెద్దమండ్యం, కురబలకోట లలోని 6 మండలాల్లో అన్ని పల్లెల్లో బెల్టు షాపులు నిర్వహణ 3 పూవులు 6 కాయలు లాగా కొనసాగుతున్న బెల్టుషాపుల యజమానుల దగ్గర నుంచి ఎక్సైజ్ అధికారులు, డబ్బుల వసూలుకు పాల్పడుతూ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు పేర్కొంటున్నారు. నిబంధనల ప్రకారం ఎక్కడ కూడా బెల్టుషాపును నిర్వహించకూడదు. అయితే ఎక్సైజ్ అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నా కింది స్థాయి సిబ్బంది మాత్రం నెలనెలా మామూళ్లు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఎక్సైజ్ అధికారులు కాకుండా గతంలో జిల్లాలో పోలీస్ శాఖ ప్రతి గ్రామంలో ఎన్ని బెల్టు షాపులు ఉన్నాయో గుర్తించింది. అయితే మండలాల్లో అధికారులు కూడా నెలవారీగా మామూళ్ళు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు బహిరంగానే వ్యక్తమవుతున్నాయి. ఇలా కొన్ని మండలాల్లో నెలకు లక్షకుపైగా బెల్టుషాపుల ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. తంబల్లపల్లి నియోజకవర్గంలో ఎక్సైజ్ అధికారులు భారీఎత్తున వసూలు చేస్తున్నారనే వాదన గట్టిగా వినిపిస్తోంది..నిద్రావస్థలో అబ్కారీశాఖ.._______________________తంబళ్లపల్లి నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్టు షాపుల్లో మద్యం విక్రయాలు కొనసాగుతున్నా అబ్కారీ శాఖ అధికారులు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారు. అడ్డూ అదుపు లేకుండా అక్రమంగా మద్యం విక్రయాలు జరుగుతున్నా పట్టించు కోవడం లేదనే ఆరోపణలున్నాయి. ముఖ్యంగా బెల్టు షాపుల్లో మూడు నెలలకు ముందు మద్యం కల్తీ వ్యాపారం భారీగా జరిగినట్టు ఆరోపణలున్నాయి. కల్తీ మద్యం కారణంగా ప్రజలు అనారోగ్యాల బారిన పడే ప్రమాదముంది. అయినా అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. వైన్ షాపులు, బెల్టు షాపుల నుంచి మామూళ్లు అందుకుంటున్న అబ్కారీశాఖ అధికారులు మద్యం మత్తులో జోగుతున్నారనే బహిరంగ ప్రచారం జరుగుతోంది. మద్యం మత్తులో ఇళ్ల మధ్యలో గొడవలు పడుతూ అర్ధరాత్రి వరకు నానా రభస చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రతి గ్రామంలో బెల్టు షాపుల ద్వారా మద్యం ఏరులై పారుతుందనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నిర్వాహకుల పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయా మండల గ్రామాల్లోని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు..~~~~~~~~~~~~~~~~~~





