Saturday, March 21, 2026

*జాతీయ స్థాయి జంబోరిలో జ్యోతి హై స్కూల్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రతిభ*——————————————

నేటి సాక్షి – జగిత్యాల టౌన్(పూరెళ్ల బాపు)……………………………………..జగిత్యాల పట్టణంలోని జ్యోతి హైస్కూల్ ఐఐటీ అకాడమీ కి చెందిన స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు నవంబర్ 23 నుండి 29 వరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లోని లక్నో లో నిర్వహించిన 19 వ జాతీయ జంబోరి లో పాల్గొన్నరానీ పాఠశాల డైరెక్టర్ మరియు జగిత్యాల జిల్లా స్కౌట్స్ అండ్ గైడ్స్ కమిషనర్ బియ్యాల హరి చరణ్ రావు తెలిపారు. జాతీయ స్థాయి జంబోరి కార్యక్రమంలో భాగంగా ఉత్తర ప్రదేశ్ లోని లక్నో లో ” వికాసిత్ యువ – వికాసిత్ భారత్” అనే నినాదం తో నిర్వహించిన జంబోరి క్యాంప్ కి జగిత్యాల జిల్లా నుండి 16 మంది స్కౌట్స్ అండ్ గైడ్స్ వెళ్లగా మన జ్యోతి హైస్కూల్ ఐఐటీ అకాడమీ నుండి 6 స్కౌట్స్ అండ్ 2 గైడ్స్ పాల్గొన్నారు అని తెలిపారు. స్కౌట్స్ విభాగం నుండి గౌతం కృష్ణ , వరుణ్ తేజ, బద్రీనాట్, వివేక్ , విశ్వతేజ, వశిష్ఠ సాయి, గైడ్స్ విభాగం నుండి కౌషికి, శ్రీనిధి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వారం రోజుల పాటు నిర్వహించిన మార్చ్ ఫాస్ట్, జానపద నృత్యాలు, బిపి ఎక్సర్సైజ్, క్యాంప్ క్రాఫ్ట్, నాటింగ్స్, రంగవల్లి, శారీరిక సామర్థ్యం మొదలగు పోటీలలో పాల్గొన్నారు.అదే విధంగా తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సాంప్రదాయాలను చక్కగా ప్రదర్శించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ బియ్యాల హరి చరణ్ రావు మరియు స్కౌట్స్ అండ్ గైడ్స్ సెక్రటరీ కొలగని మధు సుధన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్స్ బియ్యాల హరి చరణ్ రావు, శ్రీధర్ రావు, మౌనిక రావు, అజిత, స్కౌట్ మాస్టర్ వేంకటేశ్వర్లు, వినోద్ మరియు ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News