Friday, March 20, 2026

కెసిఆర్ దీక్ష అమరుల త్యాగ ఫలితమే నేటి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుమాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి

నేటి సాక్షి,నారాయణపేట, డిసెంబర్ 9,కెసిఆర్ దీక్ష అమరుల అగ ఫలితమే నేటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పునాది లాంటిది అని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు మంగళవారం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన విజయ్ దివాస్ కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ చౌరస్తాలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కి పూలమాల వేసిన అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన అంతరం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు బ్రేడ్లను పంపిణీ చేశారు.అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కెసిఆర్ ప్రజాస్వామ్య బద్దంగా ఉద్యమాన్ని నడిపి ఆనాటి కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెడలు వంచి రాష్ట్ర ప్రక్రియను ప్రారంభం చేస్తున్నాం అని ప్రకటింపజేసినచరిత్ర కేసీఆర్ కి దక్కుతుందని ఆయన కొనియాడారు ఆరోజు ఎంతమంది విద్యార్థులు అమరుల అయ్యారని వారి ప్రాణ త్యాగం ఫలితంగానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పునాది రాయల అయిందని వారన్నారు.రాష్ట్రం సాధించుకున్న తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వ ఏర్పాటు కొని పదేళ్లపాటు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం అనేక సంక్షేమం పథకాలు చేపట్టి అభివృద్ధికి ఎంతో కృషి చేసిన చరిత్ర కేసీఆర్ కే దక్కుతుందన్నారు తెలంగాణ రాష్ట్రం ఉన్న అన్నిరోజులు కేసీఆర్ పేరు సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుందని దానిని చెడిపే సత్తా ఎవరికి లేదని ఆయన తెలిపారు. కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విషయంలో దొంగ వైఖరి వాలంబించడం వలననే వందలాది మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చిందని దానికి కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించుకోక తప్పదు అన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ప్రజలను నిలువుగా మోసం చేసిందని తెలిపారు 6గ్యారెంటీ లో ఒకటి కూడా అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని తెలిపారు స్థానిక సమస్య ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచే అభ్యర్థులకు తగిన బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పి నరసింహ గౌడ్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కొత్త శ్రీనివాస్ గుప్తా,పట్టణ అధ్యక్షుడు చిన్న హనుమంతు ప్రధాన కార్యదర్శి అశోక్ కుమార్ గౌడ్ మాజీ కౌన్సిలర్లు, అన్వర్ హుస్సేలు జగ్గలి రాములు,మొగిలప్ప జుట్ల శంకర్, శివారెడ్డి,సాగర్ కుమారి రవి మన న్‌ రాజు, ఎలిగండ్ల బాలప్ప,వినోద్ అమ్రేష్,నేతాజీ రెడ్డి,ఈశ్వర్ యాదవ్, నరసింహులునాయుడు ,అప్పి గౌడు,నవీన్ గౌడ్ లు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News