నేటి సాక్షి, నారాయణపేట, డిసెంబర్ 9, పేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలో మంగళవారం స్థానిక సంస్థ ఎన్నికల్లో భాగం మరికల్ భూ సంరక్షణ కమిటీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి గుప చెన్నయ్య, గుర్తు ఉంగరం,14 వార్డులలో భూ సంరక్షణ కమిటీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని మద్దతు ప్రకటిస్తున్నామని భూ సంరక్షణ కో కమిటీ అధ్యక్షులు వెంకట్ రామ్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశానికి రిటైర్డ్ టీచర్ వెంకట్ రాములు, మరికల్ భూ సంరక్షణ కమిటీ కోశాధికారి మాదాసి కురువ రాచాల భీమరాజు, అధ్యక్షులు బసాయపల్లి మల్లేష్, ఉపాధ్యక్షులు జి సుదర్శన్, మోడీ శ్రీరాములు, రాజ మల్లేష్, జి మల్లేష్, డి లక్ష్మయ్య, పెద్ద ఎంకమ్మ వాళ్ళ బొంత రాములు, బొంబాయి గోపాల్, పెద్ద ఎంకమ్మ వాళ్ళ లక్ష్మమ్మ, సబమ్మ, చిన్న లక్ష్మమ్మ, భూ సంరక్షణ కమిటీ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.





