నేటి సాక్షికొమురం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి డిసెంబర్ 9కొమరం భీం జిల్లాలో జరిగే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవడం ద్వారా గ్రామాభివృద్ధిని మరింతగా ముందుకు తీసుకెళ్లవచ్చని ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటం వలన, గ్రామ సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారాలు కేవలం కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమన్నారు.ప్రతి గ్రామంలో అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్యం మరియు పారిశుధ్య సమస్యలకు తక్షణ పరిష్కారం కనుగొనడం కోసం స్థానిక సర్పంచ్ అభ్యర్థులు కీలకపాత్ర పోషిస్తారని. గ్రామాల ప్రజలకు సంప్రదాయ, సామాజిక, అభివృద్ధి అంశాలపై అవగాహన కల్పించడమే కాకుండా, కాంగ్రెస్ అభ్యర్థుల విజయంతో గ్రామాభివృద్ధి అవుతుందని.జిల్లాలోని స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి అభ్యర్థులను గెలిపించుకోవాలని ఆత్రం సుగుణక్క ప్రజలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్.అజ్మీర శ్యామ్ నాయక్, కార్యకర్తలు పాల్గొన్నారు





