Friday, March 20, 2026

మదనపల్లి జిల్లా కేంద్రంలో ఎస్పీ కార్యాలయం ఏర్పాటుకు ముమ్మర స్థల పరిశీలన.. జిల్లా ఎస్పీ

నేటి సాక్షి పత్రిక పాత్రికేయులు శర్మ, అన్నమయ్య జిల్లా, డిసెంబర్ 09 ~అన్నమయ్య జిల్లా :-: నూతనంగా ఆవిష్కరమవుతున్న మదనపల్లి జిల్లా కేంద్రంలో ఎస్పీ కార్యాలయ ఏర్పాటుకు మంగళవారం జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పలు భవనాలను పరిశీలించడానికి విచ్చేశారు. ఆయన వెంట డీ ఎస్పీ మహేంద్ర విచ్చేసి ఎస్పీ కార్యాలయం ఏర్పాటుకు పలు భవనాలను జిల్లా ఎస్పీ కి చూపించారు. మదనపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయం ఏర్పాటుకు అన్వేషిస్తున్నాం – ఎస్పీ————————————-మదనపల్లి జిల్లా కేంద్రంలో గల ఎస్పీ కార్యాలయం ఏర్పాటుకు పట్టణంలోని పలుచోట్ల భవనాలను పరిశీలించి, ఎంపిక కోసం అన్వేషిస్తున్నామని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు. మదనపల్లికి వచ్చిన ఎస్పీ స్థానికంగా ఉన్న పలుచోట్ల ప్రభుత్వం, మిషనరి భవనాలను స్వయంగా వెళ్లి పరిశీలించారు. ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ నెలాఖరు లోపు ఎస్పీ కార్యాలయం ఏర్పాటుకు అనువైన భవనాన్ని ఎంపిక చేస్తామని జనవరి 1 నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తామని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి స్పష్టం చేశారు..~~~~~~~~~~~~~~~~~

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News