Friday, March 20, 2026

కాగజ్ నగర్ రిజిస్టర్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష ,కార్యదర్శిలకు సన్మానం

నేటి సాక్షి కొమరం భీమ్ ఆసిఫాబాద్ ప్రతినిధి డిసెంబర్ 9కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క , ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీర శ్యామ్ నాయక్ కాగజ్ నగర్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి లకు శాలువా పూలమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సుగుణక్క మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారిదిగా పనిచేస్తున్న పత్రికా మిత్రులకు ప్రజాస్వామ్యంలో ఫోర్త్ స్టేట్ గా వాస్తవాలు చూపిస్తూ నిరంతరం పనిచేస్తూ మంచి పేరు ప్రతిష్ట తీసుకొస్తూ జిల్లా అభివృద్ధికి తోడ్పడుతూ ముందుకు సాగాలని కోరారు . ఆసిఫాబాద్ నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ శ్యాం నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వ ఫలాలు చేరే వేసే నిరంతర ప్రక్రియ పాత్రికేయ మిత్రుల పాత్ర చాలా ముఖ్యమన్నారు. అదేవిధంగా తోటి పాత్రికేయ మిత్రులతో స్నేహభవంగా ఉండాలని, కాగజ్ నగర్ ప్రెస్ క్లబ్ కు మంచి పేరు తీసుకురావాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు దుర్గం నిరంజన్ కోశాధికారి. వెంకటేష్ రమేష్ ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News