Friday, March 20, 2026

*పారుమంచాల బ్రిడ్జి కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలి… సిపీఐ.. జిల్లా కార్యవర్గ యం. రమేష్ బాబు పట్టించుకోని ఆర్&బి అధికారులను సస్పెండ్ చేయాలి.. సిపిఐ , ఎం. రమేష్ బాబు* ..

నేటి సాక్షి 09 జూపాడుబంగ్లా :—-జూపాడుబంగ్లా మండలం నుండి నంద్యాల జిల్లా కేంద్రానికి పారుమంచాల గ్రామానికి రాకపోకలకు ప్రధాన రహదారిగా ఉన్న పారుమంచాల బ్రిడ్జి నిర్మాణం కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే ప్రభుత్వం అనుకున్న సమయానికి జరగలేదని, కాంట్రాక్టర్ ఆర్ అండ్ బి అధికారుల కుమ్మక్కు తో అధికారుల పర్యవేక్షణలో పనులు జరగడం లేదని నిర్లక్ష్యం చేస్తున్న అధికారులు కాంట్రాక్టర్ పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని,,క్వాలిటి విజిలెన్స్ చే విచారణ చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం… రమేష్ బాబు ప్రభుత్వాన్ని కోరారు.. మంగళవారం పారుమంచాల బ్రిడ్జి పనులను పరిశీలించారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పారుమంచాల బ్రిడ్జి నిర్మాణానికి కోట్ల రూపాయల నిధులు విడుదలకు ఆదేశాలు జారీచేసిన పనులు మొదలుపెట్టిన కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో నేటికీ నత్తనడకన పనులు జరుగుతున్నాయని అధికారులు పట్టించుకోవడంలేదని. ఎన్నో సంవత్సరాలుగా పారుమంచాల బ్రిడ్జి కోసం సిపిఐ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు జరిగాయని అయితే ప్రభుత్వం ఆర్ అండ్ బి ద్వారా నిధులు విడుదల చేయడం జరిగిందని ఆ నిధులను సక్రమంగా సమయానికి బ్రిడ్జి పూర్తి చేసేందుకు ఉపయోగించాలని అలా కాకుండా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం చేస్తున్నాడని అధికారుల పర్యవేక్షణ లోపం కనబడుతుందని వారన్నారు.. దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మిస్తున్న బ్రిడ్జిని నాణ్యతగా నిర్మించాలని అవినీతికి చోటు లేకుండా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలన్నారు. రెండు మూడు మాసాల క్రిందటి పనులు పూర్తి కావాల్సి ఉన్న పట్టించుకునే నాధుడు లేక కాంట్రాక్టర్ నిర్లక్ష్యం చేస్తున్నాడని వారు విమర్శించారు..అనేక నెలల నుండి పనులు నత్తనడకన జరుగుతున్నాయి కానీ పూర్తికాని పరిస్థితి నెలకొందని అలాగే పారుమంచాల నుండి పారుమంచాల గ్రామం వరకు రోడ్డు నిర్మాణం నాణ్యతగా లేదని చెడిపోయిందని తక్షణమే ఈ విషయం పై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించి కాంట్రాక్టర్ రద్దు చేయాలని వారి కోరారు.. ఇవే కాకుండా అనేకచోట్ల ఆర్ అండ్ బి రోడ్లు ధ్వంసం అయ్యాయని అయితే పట్టించుకునే పరిస్థితిలో అధికారులు లేని పరిస్థితి ఉందన్నారు .తక్షణమే ఆర్ అండ్ బి అధికారులు కార్యాలయాలు వీడి రోడ్ల మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు..ఈ కార్యక్రమం లో సీపీఐ నాయకులు సుధాకర్, రాజు లు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News