నేటి సాక్షి, ఎండపల్లి(రియాజ్):* తెలంగాణ రాష్ట్ర పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ మూడో విడత షెడ్యూల్ ప్రకారం మంగళవారం అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. దీంతో బరిలో నిలిచిన సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థుల తుది జాబితా విడుదల చేసి వారికి గుర్తులను కేటాయించారు. కాగా మండలంలో అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కొండాపూర్ గ్రామానికి సర్పంచ్ జనరల్ మహిళ రిజర్వేషన్ కేటాయించగా ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. చివరి రోజు ఇద్దరు అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో… వెల్గటూర్ ఉమ్మడి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాటిపర్తి శైలేందర్ రెడ్డి స్వయాన తల్లి ‘రాజమ్మ-తిరుపతి రెడ్డి’ ఒక్కరు మాత్రమే పోటిలో ఉండటంతో ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. మిగిలిన వార్డు సభ్యుల ఎన్నికకు సంబంధించి పది వార్డులు ఉండగా ఏడు వార్డులు ఇదే తరహలో 2వ వార్డు జాడి కళ్యాణి, 3వ వార్డు తనుగుల విజయ్ కుమార్, 5వ వార్డు దేవి సునీల్, 6వ వార్డు చిత్తారి అనూష, 7వ వార్డు చిన్న అంజయ్య, 8వ వార్డు ఎలగందుల రాజా, 10వ వార్డు గుమ్మడి రాజ్ కుమార్ లు ఏకగ్రీవం అయ్యారు. మిగిలిన 1, 4, 9 వార్డులకు ఈ నెల 17న ఎన్నికలు జరిగిన వెంటనే అధికారిక ప్రకటన. వీరు ఏకగ్రీవం కావడంలో కీలక నేతల హస్తం ఉన్నట్టు వినికిడి. ఏది ఏమైన ఎన్నికలు అంటే అభ్యర్థులు తగ్గేదేలే అనే ఈ రోజుల్లో కొండాపూర్ సర్పంచ్, పలువురు వార్డు సభ్యులు ఏకగ్రీవమైన తీరు ఆదర్శంగా నిలిచింది. గ్రామంలో ఐక్యత చాటేలా అభివృద్ది లక్ష్యంగా అభ్యర్థులు, ప్రజలు తీసుకున్న నిర్ణయం పట్ల అభినందనలు వ్యక్తం అవుతున్నాయి.





