నేటి సాక్షి,నల్లబెల్లి, డిసెంబర్ 09 :1960లో నీల రాజలింగం గుప్త ఏకగ్రీవ సర్పంచ్‌గా ఎన్నికైన తరుణం తర్వాత నల్లబెల్లిలో ఒక్కసారి కూడా ఏకగ్రీవ ఎన్నిక నమోదు కాకపోవడం గ్రామ రాజకీయ చైతన్యానికి ప్రత్యేక ముద్ర వేసింది. ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తూ ప్రతి ఎన్నికలో పోటీలు, ఆలోచనాత్మక ప్రచారాలు చోటుచేసుకోవడం నల్లబెల్లి ప్రజల జాగృతికి నిదర్శనం. అభిప్రాయ భిన్నతలు, అభివృద్ధికి చర్చలు, ప్రజల తీర్పు—ఇవి అన్నీ ఈ గ్రామాన్ని రాజకీయ స్పూర్తికి ప్రతీకగా నిలబెట్టాయి. నేటికీ అదే ఉత్సాహం కొనసాగుతూ, ప్రజాస్వామ్య శక్తి ఏమిటో నల్లబెల్లి మరల చాటుతోంది.





