Friday, March 20, 2026

కాగజ్ నగర్ ప్రెస్ క్లబ్. సర్వసభ సమావేశం నూతన కోశాధికారిగా గాడి పెళ్లి వెంకటేష్ ఏకగ్రీవ ఎన్నిక..

నేటి సాక్షి కొమరం భీమ్ ఆసిఫాబాద్ ప్రతినిధి డిసెంబర్ 9కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని రిటైర్డ్ ఉద్యోగుల విశ్రాంతి భవనంలో మంగళవారం రోజున మీడియా మిత్రులు సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా, కాగజ్ నగర్ ప్రెస్ క్లబ్ పాలకవర్గం నూతన కోశాధికారిని ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అహ్మద్ పాషా, గౌరవ అధ్యక్షుడు వడ్నాల వెంకన్న, మరియు ప్రధాన కార్యదర్శి ఈర్ల సతీష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో, గాడి పెళ్లి వెంకటేష్ ను ప్రెస్ క్లబ్ కోశాధికారిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.నూతన కోశాధికారి స్పందనకోశాధికారిగా ఏకగ్రీవంగా ఎన్నికైన అనంతరం గాడి పెళ్లి వెంకటేష్ మాట్లాడుతూ. కోశాధికారి వెంకటేష్ ఆయన కృతజ్ఞతలు తెలపడం, ప్రెస్ క్లబ్ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇవ్వడం మీడియా మిత్రులంతా నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. ప్రెస్ క్లబ్ అభివృద్ధికి, సభ్యుల సంక్షేమానికి నా వంతు కృషి చేస్తాను. ఆర్థికపరమైన అంశాలలో పారదర్శకత పాటిస్తూ అందరి సహకారంతో ముందుకు వెళ్తాను అని ఆయన పేర్కొన్నారు.ఈ సమావేశంలో ప్రెస్ క్లబ్ సభ్యులు ఇర్ల సునీల్, దుర్గం నిరంజన్, తాజ్ ఖాన్, కడారి శీను. అర్షద్.అతికుర్.రెహమాన్, ఫారుక్, ఇలియాస్, ప్రవీణ్ , రాజు, సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News