నేటి సాక్షి పత్రిక పాత్రికేయులు శర్మ, అన్నమయ్య జిల్లా, డిసెంబర్ 10 ~అన్నమయ్య జిల్లా :-: జిల్లా వాహనదారులకు ఒక ముఖ్య గమనిక అందిస్తున్నామని గౌరవ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల డిసెంబర్ 13వ తారీకున శనివారం నాడు జరగబోయే జాతీయ మెగా లోక్ అదాలత్ లో పెండింగ్‌లో ఉన్న ఈ – చలాన్లను చెల్లించడానికి ప్రభుత్వం ఒక సువర్ణావకాశాన్ని కల్పిస్తున్నామని ఈ ప్రత్యేక లోక్ అదాలత్ ద్వారా, వాహనదారులు తమ వాహనాలపై ఉన్న పెండింగ్ ఈ – చలాన్ల విషయంలో ఎటువంటి అదనపు చర్యలు లేకుండా, కేవలం అసలు మొత్తాన్ని మాత్రమే చెల్లించి, క్లియర్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని ఈ అవకాశాన్ని చలాన్ దారులు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని గతంలో లేని విధంగా వస్తున్న ఈ సౌకర్యాన్ని ప్రతి ఒక్క వాహనదారుడు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ “పెండింగ్ చలాన్లు కలిగిన వాహనదారులు ఈ లోక్ అదాలత్ ద్వారా తమ భారాలను తగ్గించుకోవచ్చని పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించి, ప్రజలకు ఉపశమనం కల్పించాలనే ఉన్నత లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని కావున అర్హులైన వారందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని, చలాన్లను తక్షణమే చెల్లించాలని జిల్లా ఎస్పీ కోరారు. మీ వాహనాలపై ఉన్న పెండింగ్ ఈ – చలాన్ల వివరాలు తెలుసుకోవడానికి కేంద్ర ప్రభుత్వ వెబ్ సైట్ https://echallan.parivahan.gov.in ను సందర్శించాలని సమయం మించక ముందే ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని చట్టాన్ని గౌరవించే పౌరులుగా సహకరించాలని అన్నమయ్య జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు..~~~~~~~~~~~~~~~~~





