Friday, March 20, 2026

తిరుపతి రూరల్ మండలం -రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం నడవడం లేదు-రెడ్ బుక్ రాజ్యాంగం రాజ్యమేలుతోంది-వైయస్ ఆర్ రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షుడు చైతన్యది అక్రమ అరెస్టు-ఫీజు బకాయిలు చెల్లించే వరకు మా పోరాటం ఆగదు…

నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)రాష్ట్రంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం అమలవడం లేదని… లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం రాజ్యమేలుతోందని వైయస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉప్పా అధ్యక్షుడు ఓబుల్ రెడ్డి మండిపడ్డారు. తుమ్మలగుంట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ… వైయస్సార్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు చైతన్యది అక్రమ అరెస్టు అని, ఇలాంటి అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని తేల్చిచెప్పారు. ఫీజులు చెల్లించాలని అడిగితే పోలీసులతో పిడిగుద్దులు, అక్రమ అరెస్టులు చేయిస్తూ… ఫాసిస్ట్ పాలన సాగిస్తున్న చంద్రబాబుకు తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. -విద్యార్థులపై పోలీసుల కర్కశత్వం…పెండింగ్ లో ఉన్న రూ.7,800 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్పులు తక్షణమే విడుదల చేయాలని ఓబుల్ రెడ్డి డిమాండ్ చేశారు….చంద్రగిరి నియోజకవర్గం విద్యార్థి విభాగం అధ్యక్షుడు చెంగల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ -రాష్ట్రంలో నడుస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగం…-వైయస్సార్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు, ఇతర విద్యార్ధులను అరెస్టు చేయడం అత్యంత దుర్మార్గం. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం నడవడం లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం రాజ్యమేలుతుంది. మా విద్యార్థి విభాగం నాయకులు ఏం తప్పు చేశారు? అధికారం చేపట్టి 18 నెలలు కావస్తున్నా… ప్రభుత్వం తాను బకాయిపడ్డ ఫీజులు చెల్లించాలనడం తప్పా? -రూ.2.50 లక్షల కోట్లు అప్పు- అయినా చెల్లించని ఫీజు బకాయిలు..దాదాపు రూ.2.50 లక్షల కోట్లు అప్పు చేసిన కూటమి ప్రభుత్వం.. విద్యార్ధుల ఫీజు బకాయిలు.. రూ.7800 కోట్లు చెల్లించలేరా?అరెస్టులుతో విద్యార్థి ఉద్యమం ఆగదు..మా నేతలను అరెస్టు చేసినా ఈ ఉద్యమం ఆగదు. మీరెంత అణిచివేయాలని చూసినా… రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాం. మీ ప్రభుత్వ పతనం తప్పదు. ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వకుండా, ఫీజులివ్వాలని కోరిన విద్యార్థి సంఘాల నేతలను జైలుకు పంపంచిన నీచమైన సంస్కృతి కూటమి ప్రభుత్వానిదే. స్టేషన్ బెయిలిచ్చే కేసుల్లోనూ అరెస్టు చేశారు. వైయస్.జగన్ రూ.4,200 కోట్లు ఫీజు బకాయిలు పెట్టారని నారా లోకేష్ దుష్ప్రచారం చేశారు. ఇది ముమ్మాటికీ తప్పు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించే వరకు మా పోరాటం ఆగదు. అరెస్టు ద్వారా ఉద్యమాన్ని ఆపలేరు అని చెంగల్ రెడ్డి హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్వీ యూనివర్సిటి అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ వివిధ మండల అధ్యక్షులు వినోద్ కుమార్,యశ్వంత్ రెడ్డి,శేష రెడ్డి.విద్యార్థి నాయకుడు ముని తదితరులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News