Friday, March 20, 2026

ఏపీ ఎలక్ట్రిసిటీ యూనియన్ 327 డిస్కం ప్రధాన కార్యదర్శిగా మురళీధర్ డిస్కం సర్వసభ్యసమావేశం లో ఏకగ్రీవం

నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి డిసెంబర్ 10ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ యూనియన్ 327 డిస్కం ప్రధాన కార్యదర్శిగా ఆర్ మురళీధర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండలంలోని దిగువపల్లి పంచాయతీ భవాని నగర్ లో జరిగిన డిస్కం సర్వసభ్య సమావేశం లో ఏకగ్రీవ ఎన్నికలు జరిగాయి రాష్ట్ర సెక్రటరీ జనరల్ రాఘవరెడ్డి డిస్కం అధ్యక్షుడు రాఘవేంద్ర ప్రసాద్ ల ఆధ్వర్యంలో ఎన్నికల పరిశీలకులు వెంకటేశ్వరరావు ల సమక్షంలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించారు ఇందులో భాగంగా డిస్కం పరిధిలో గల కర్నూలు జిల్లా కు చెందిన లక్ష్మీకాంతరెడ్డిఅధ్యక్షుడిగా, కోశాధికారిగా నెల్లూరు జిల్లా కు చెందిన గోపినాథ్,వర్కింగ్ ప్రెసిడెంట్ గా అనంతపురం కు చెందిన ప్రహ్లాదాచారి, ఉపాధ్యక్షులు గా కడప జిల్లా కు వెంకటా చలపతిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా రాఘవరెడ్డి ప్రసంగిస్తూ విద్యుత్ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు అహర్నిశలు చేస్తున్నట్లు వివరించారు, నూతనంగా ఎంపికైన కమిటీ సభ్యులు సైతం వారికి అందుబాటులో ఉండి మరిన్ని కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని ఆయన సూచించారు సంఘం కట్టుబాట్లకు కట్టుబడి ఉండి కార్మికుల సంక్షేమానికి కృషి చేయాలన్నారు. ఇటు సంస్థ అటు ప్రభుత్వం లలో ఎవరికైనా ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే స్పందించాలన్నారు.అనంతరం సంఘ విధివిధానాలను వివరించారు.ఈ కార్యక్రమంలో నాయకులు భాస్కరరావు డిస్కం రీజనల్ డివిజనల్ లకు సంబంధించిన నాయకులు పాల్గొన్నారు,కాగా పలువురు ట్రాన్స్కో కార్మికులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలక్ట్రికల్ యూనియన్ లో చేరారు, వారికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News