నేటి సాక్షి,బాపట్ల జిల్లా ప్రతినిధి బాపట్ల నియోజకవర్గంలో అందమైన రహదారులు రూపుదిద్దుకోబోతున్నాయి.పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వీటి నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. సుమారు 10 కోట్ల రూపాయల నిధులు వీటి కోసం మంజూరు చేసినట్లు శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు వెల్లడించారు.బాపట్ల నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి తాను చేసిన ప్రతిపాదనలను వెంటనే ఆమోదం తెలిపి నిధులు మంజూరు చేయడం సంతోషకరంగా ఉందని అన్నారు. నిధుల మంజూరుకు సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లకు ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు కృతజ్ఞతలు తెలిపారు. కర్లపాలెం మండలం నాగరాజు పాలెం రహదారికి ఒక కోటి 78 లక్షలు, పొన్నూరు- చందోలు జడవల్లిని కలిపే రహదారి నిర్మాణానికి ఒక కోటి 47 లక్షలు, రేపల్లె ఖాజీ పాలెం ఆర్&బి రోడ్డు నుండి కొత్తపాలెం వయా పరిశావారి పాలెం రోడ్డుకు ఒక కోటి 27 లక్షలు, తారకరామా ఎస్టీ కాలనీ నుండి కర్లపాలెం ఎం.వి.రాజుపాలెం రోడ్డుకు ఒక కోటి 43 లక్షలు, గణపవరం ఆర్ & బి రోడ్డును కలుపుతూ కర్లపాలెం దండుబాట రోడ్డుకు 99 లక్షలు, పెదగొల్లపాలెం నుండి గణపవరం వయా నక్కల వారి పాలెం రోడ్డుకు 60 లక్షలు, పెదపులుగువారి పాలెం ఆర్ & బి రోడ్డు నుండి మర్రి కట్టవ జడ్పీ రోడ్డుకు 42 లక్షలు, జాతీయ రహదారిని కలిపే కొండుభోట్లపాలెం రోడ్డుకు 11 లక్షలు, జాతీయ రహదారిని కలిపే సుబ్బారెడ్డి పాలెం రోడ్డుకు 91లక్షలు, నర్సాయపాలెం నుండి పైలబాట రోడ్డుకు 52 లక్షలు మంజూరైనట్లు బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు వివరించారు. మొత్తం గా బాపట్ల నియోజకవర్గంలో 20 కిలోమీటర్ల మేర రహదారులకు సుమారు 10 కోట్ల రూపాయలు మంజూరైనట్లు తెలిపారు..

