Friday, March 20, 2026

*సోలరైజేషన్ పథకం క్రింద ఏ.పిలో అమలవుతున్న సోలార్ కార్‌పోర్ట్ ఏర్పాటు వివరాలను కోరిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ* *సానుకూలంగా స్పందించిన భారత ప్రభుత్వం**వివరాలను వెల్లడించిన కేంద్ర నూతన, పునరుత్పాదక ఇనర్జా మంత్రిత్వ శాఖ*

నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)చిత్తూరు (ఢిల్లీ)-10-12-25సోలరైజేషన్ పథకం క్రింద ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న సోలార్ కార్‌పోర్ట్ ఏర్పాటు వివరాలను బుధవారం చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు భారత ప్రభుత్వాన్ని కోరారు..దీనికి సానుకూలంగా స్పందించిన కేంద్ర నూతన, పునరుత్పాదక ఇనర్జా మంత్రిత్వ శాఖ, సోలార్ కార్‌పోర్ట్ ఏర్పాటుకు సంబంధించిన వివరాలను లిఖిత పూర్వకంగా తమకు అందినట్లు చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ తెలియజేశారు.న్యూఢిల్లీ పార్లమెంటు శీతాకాల సమావేశాలకు హాజరైన చిత్తూరు చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు..,ఏ.పి.సీయం చంద్రబాబు నాయుడు ప్రోత్సాహంతో ఆంధ్రప్రదేశ్ హక్కులు, ప్రయోజనాల సాధన కోసం పాటు పడుతున్నారు.ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి, విజయవాడ, అన్నవరం, అహోబిలం, అరసవిల్లి వంటి ప్రధాన దేవాలయాల్లో అమలు చేసి, విజయవంతమైన సౌర కార్‌పోర్ట్ మోడల్‌ను పునరావృతం చేయడానికి ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసిందా…? అలాగే దీనికి సంబంధించి, రాష్ట్ర ప్రభుత్వాలు లేదా దేవస్థానాలతో ఏవైనా చర్చలు లేదా సాధ్యాసాధ్యాల అంచనాల పై సమీక్షలు చేసారా..? అదేవిధంగా దేవాలయ-ఆధారిత సౌర ప్రాజెక్టుల కోసం ఉన్న పునరుత్పాదక ఇనర్జా పథకాల క్రింద ఆర్థిక లేదా సాంకేతిక సహాయాన్ని అందించడానికి ఏవైనా ప్రతిపాదనలు ఉన్నాయా..? అలా అయితే, ఆంధ్రప్రదేశ్.., గుజరాత్‌లోని అటువంటి దేవాలయ సౌర కార్‌పోర్ట్‌ల ద్వారా గ్రిడ్ ఆధారపడటాన్ని తగ్గించడం, క్లీన్ ఎనర్జీ అనుసరణను ప్రోత్సహించడం కోసం అంచనా వేయబడిన సామర్థ్యం ఎంత? అన్న అంశాలకు సంబంధించిన వివరాలను చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు కోరారు. దీనికి తక్షణం స్పందించిన కేంద్ర నూతన , పునరుత్పాదక ఇనర్జా , పవర్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద యెస్సో నాయక్.., సౌర కార్‌పోర్ట్‌ల వివరాలను లిఖిత పూర్వకంగా తమకు అందినట్లు చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు తెలిపారు. దేవాలయాల్లో సౌర కార్‌పోర్ట్‌ల ఏర్పాటుకు సంబంధించిన ఏ నిర్దిష్ట పథకాన్ని అమలు చేయడం లేదని. అలాగే, అటువంటి దేవాలయ-ఆధారిత సౌర ప్రాజెక్టుల కోసం ఉన్న పునరుత్పాదక ఇనర్జా పథకాల క్రింద ఆర్థిక లేదా సాంకేతిక సహాయాన్ని అందించడానికి ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర నూతన , పునరుత్పాదక ఇనర్జా , పవర్ శాఖ సహాయ మంత్రి లేఖలో వివరించినట్లు పేర్కొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News