(నేటి సాక్షి )బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం నిజాం నిరంకుశ పాలనపై జమిందారీ వ్యవస్థపై పోరాడిన బహుజన వీరుడు పండుగ సాయన్న ముదిరాజ్ వర్ధంతి వేడుకలను గాజులరామారం చౌరస్తాలోని బీసీ ముదిరాజ్ సంఘ నాయకులు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ.. పండుగ సాయన్న ముదిరాజ్ 1860 నుండి 1900 కాలంలో నాటి నిజాం ప్రభుత్వ నిరంకుశ పాలనను వ్యతిరేకించారని బడుగు బలహీన వర్గాల హక్కులను కాలరాస్తున్న జమిందారి, దేశముఖ్ కు వ్యతిరేకంగా పోరాడారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మన్నే రాజు ముదిరాజ్, సీనియర్ నాయకులు సుంకరి సాయి ప్రతాప్ ముదిరాజ్, సీనియర్ జర్నలిస్ట్ సుగ్రీవుడు ముదిరాజ్, జర్నలిస్ట్ పాండు ముదిరాజ్ , జర్నలిస్ట్ జెల్ల శివ ముదిరాజ్, అధ్యక్షుడు దుర్గయ్య ముదిరాజ్ , శ్రీధర్ ముదిరాజ్, పండగ వెంకటేష్, దొంతుల రమేష్ ముదిరాజ్, జితయ్య ముదిరాజ్, ఈగ ఆంజనేయులు ముదిరాజ్, డి వెంకటేష్, బంటరపు లక్ష్మణ్ , జెల్ల శివ ముదిరాజ్ , నీరుడి శివ ముదిరాజ్, మెకానిక్ గోపాల్ ముదిరాజ్ , కురాపాటి రాజు ముదిరాజ్ వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.





