నేటి సాక్షి ,నారాయణపేట, డిసెంబర్ 11,కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోని గ్రామంలో ఉన్న నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత దక్కిందని నారాయణపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు కుంభం శివకుమార్ రెడ్డి అన్నారు .గురువారం మరికల్ మండల పరిధిలోని వెంకటాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కే విజయ్ కుమార్ రెడ్డి మద్దతుగా గ్రామస్తుల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం పలు వార్డులలో తిరుగుతూ వెంకటాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి విజయ్ కుమార్ రెడ్డి కి కత్తెర గుర్తుకే ఓటు వేసి గెలిపించాలంటూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వెంకటాపూర్ గ్రామ చౌరస్తాలో కార్యకర్తలను గ్రామస్తులు ఉద్దేశించి కుంభం శివకుమార్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్లు అనేక సంక్షేమ పథకాలను మంజూరు చేసిన ఘనత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కే దక్కిందని ఆయన అన్నారు. వెంకటాపూర్ గ్రామంలో గ్రామస్తులు కలిసికట్టుగా ఉంటే గ్రామానికి దేవాలయం కి సరిపడే నిధులను తన వంతు సహాయంగా మంజూరు చేయిస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. అదేవిధంగా గ్రామంలో ఎస్సీ బీసీ కమ్యూనిటీ హాల్ కోసం స్థలాలను గ్రామ సర్పంచ్ అభ్యర్థి విజయ్ కుమార్ రెడ్డి ముందుకు వచ్చి స్థలాలను ఇచ్చేందుకు హామీ ఇచ్చారు అందుకు భవనాల నిర్మాణం కోసం ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి నిధుల కింద మంజూరు చేయిస్తానని కుంభం శివకుమార్ రెడ్డి అన్నారు. గ్రామంలో కలిసికట్టుగా ఉండి స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కత్తెర గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు సూర్య మోహన్ రెడ్డి, ఉంగరాల వెంకట్ రెడ్డి, వర్ధన్ రెడ్డి, వెంకటేష్, కృష్ణారెడ్డి , మాధవరెడ్డి రతన్ పాన్ రెడ్డి,వీరారెడ్డి, తిరుపతిరెడ్డి ,వడ్ల రవి, శ్రీనివాస్ రెడ్డి వడ్డే దేవన్న యుగేందర్ రెడ్డి ఎస్ వెంకట్ రెడ్డి ,జి .మనోహర్, శ్యాంసుందర్, వడ్ల రాజు రామ్ చందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.





