నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)*రామచంద్రాపురం*మండలంలోని వెంకట్రామాపురం సమీపంలో ఉన్న సెవెన్ హిల్స్ ఫార్మసి కళాశాలలో గురువారం ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ ఆధ్వర్యంలో ఆధార్ ఎనేబుల్డ్ బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్ (ఎఇబిఎ ఎస్)పై రాష్ట్ర వ్యాప్తంగా ఫార్మసీ కళాశాలలు ప్రిన్సిపాల్ లు , నోడల్ అధికారుల కోసం ప్రత్యేక ఓరియంటేషన్ వర్క్ షాప్ ను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ ఇండియా కౌన్సిల్ మెంబర్ డాక్టర్ యం నిరంజన్ బాబు మాట్లాడుతూ ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ విడుదల చేసిన మార్గదర్శకాలు ప్రకారం ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ తప్పనిసరి అని ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఐటీ చైర్మన్ సత్యమూర్తి అన్నారు జనవరి 1- 2026 నుంచి బయోమెట్రిక్ తప్పనిసరిగా అమలు చేయాలని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఎఇబిఎఎస్ నమోదు ఫ్యాకల్టీ ఐడి ఆధారిత దృవీకరణ , బయోమెట్రిక్ పరికరాలు రిజిస్ట్రేషన్ డిసెంబర్ 31 -2025 లోపు పూర్తి చేయాల్సిన దశలను వర్క్ షాప్ లో వివరించారు ఈ కార్యక్రమంలో వివిధ ఫార్మసీ కళాశాలల ప్రిన్సిపాల్ లు, నోడల్ ఆఫీసరు లు, విభాగాధిపతులు పాల్గొన్నారు అదేవిధంగా ముఖ్య అతిథిగా ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ జషు భాయ్ హిరాభాయ్ చౌదరి మాట్లాడుతూ ఫార్మసీ కౌన్సిల్ అమోధిత విద్యాసంస్థలు తప్పని సరిగా అనుసరించ వలసిన కంప్లయన్స్ విధానాలను స్పష్టంగా వివరించారు ఈ కార్యక్రమంలో కౌన్సిల్ ఐటీ చైర్మన్ సత్యమూర్తి గౌరవ అతిథిగా పాల్గొన్నారు





