Friday, March 20, 2026

వైసీపీ నాయకుల ఆత్మీయ సమ్మేళనం..తంబళ్లపల్లి శాసనసభ్యులను కలిసిన వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు..

నేటి సాక్షి అన్నమయ్య జిల్లా, శర్మ, డిసెంబర్ 11 ~అన్నమయ్య జిల్లా :-: కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతం అయినందున గురువారం తంబళ్లపల్లి శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి కార్యాలయం నియోజకవర్గ వైసీపీ శ్రేణులతో సందడి సంతరించుకుంది. నియోజకవర్గ వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున వైసీపీ కార్యాలయం వద్దకు చేరుకొని ద్వారకానాథ్ రెడ్డి ని ఆత్మీయ సమావేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున విజయం సాధించిందని కూటమి నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయని ఇంకా పరిగెత్తిస్తామని ద్వారకానాథ్ రెడ్డి పేర్కొన్నారు. ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ కావడంతో ద్వారకానాథ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కూటమి నేతల మెడలు వంచైనా మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని ఇదే ఊపు సార్వత్రిక ఎన్నికల్లోను చూపించి సర్పంచు, ఎంపీటీసీ స్థానాలను దక్కించుకొని కూటమి ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లి వచ్చే ఎన్నికల్లో మళ్లీ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ ను అఖండమైన మెజారిటీతో గెలిపించి మనం అనుకున్నవి సాధించాలని ఈ విధంగా ప్రతి ఒక్కరు అడుగులు వేయాలని ద్వారకానాథ్ రెడ్డి సూచించారు. కూటమి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టి 18 నెలలు కాకనే ప్రజల్లో విమర్శలు, ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంది. వాళ్లు నిర్వహిస్తున్న సర్వేల్లోనే వాళ్లకు అనుకూలమైన సర్వేలు రావట్లేదు. ఇంత మంది ఎమ్మెల్యేలు, ఇన్ని ఎంపీల అభ్యర్థుల చిట్టా ప్రజల్లో విమర్శలు ఎదుర్కొంటుంది. ఎక్కడికి వెళ్లినా ఏ మారుమూల గ్రామానికి వెళ్లిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను తనివి తీరా ఆశీర్వదిస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉండుంటేనే బాగుండేదంటూ ప్రతి ఒక్కరి నోటి మాట వినిపిస్తోంది. గత ప్రభుత్వ పాలనలో మనం మంచి చేశాము కాబట్టి మనల్ని ప్రజలంతా ఆశీర్వదిస్తున్నారు. మనం ప్రజలను సరిగా పట్టించుకోకపోయి ఉంటే కూటమి ప్రభుత్వ నేతలా మనకు చెడ్డపేరు వచ్చేది. మనం మంచి చేసాం. మరోమారు ప్రజల్లోకి వెళ్లేందుకు కాలర్ ఎగరేసుకొని మరీ వెళ్లొచ్చు. మేము మంచి చేశామని ప్రజలకు చెప్పచ్చు. కానీ కూటమి నేతలు కూటమి నాయకులు గ్రామాల్లోకి వెళ్లేందుకు మొహం దాచుకుంటున్నారు. గ్రామాల్లోకి వెళ్తే ఎక్కడ పథకాలు, మా పింఛన్లు రద్దు చేశారని ఎక్కడ అడుగుతారోనని గ్రామాల్లోకి వెళ్లట్లేదు. దీనిని మనమంతా ఆసరాగా తీసుకొని ప్రజల్లోకి వెళ్దాం. నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుదాం. మళ్లీ జగనన్నను ముఖ్యమంత్రిగా గెలిపించుకుందామంటూ ద్వారకానాథ్ రెడ్డి సమ్మేళన కార్యక్రమంలో అందరికీ హితబోధ చేశారు. అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలో 15వ తారీఖున తలపెట్టిన కార్యక్రమం భారీ ఎత్తున విజయవంతం చేయాలని మన జిల్లా వాళ్లకు రాయచోటిలో ఇదే ఆఖరి కార్యక్రమమని కాబట్టి ప్రతి ఒక్కరు 15వ తారీఖున రాయచోటికి తరలి రావాలని ద్వారకానాథ్ రెడ్డి సూచించారు. ఈ సమ్మేళన కార్యక్రమంలో తంబళ్లపల్లి నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీ లు, ఎంపీపీలు, పార్టీ అనుబంధ విభాగాల ప్రతినిధులు, పార్టీ సీనియర్ నాయకులు, వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు..~~~~~~~~~~~~~~~~

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News