టి సాక్షి తిరుపతి (బాదూరు బాల)—————————-చిత్తూరు (ఢిల్లీ)-11-12-25—————————-కేంద్ర ప్రభుత్వంపరిశ్రమలకు ఊతమిచ్చే సంస్కరణలు తీసుకొస్తూ.., దేశ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ సమస్యకు పరిష్కార మార్గాన్ని చూపే పీఎంకేఎస్‌వై ఫుడ్ పార్క్స్ ప్రాజెక్టుల స్థాపనకు పూనుకోవడం హర్షనీయమని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు భారత ప్రభుత్వ కృషిని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్కు మూడు ఫుడ్ పార్క్స్ ప్రాజెక్టులను ముంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ.., తాను ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరులో శ్రీని మెగా ఫుడ్ పార్క్ను ఏర్పాటు చేయడం పై ఆనందం వ్యక్తం చేశారు.న్యూఢిల్లీ పార్లమెంటు శీతాకాల సమావేశాలకు హాజరైన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు..,ప్రధాన మంత్రి కిసాన్ సంపద యోజన క్రింద ఆమోదించబడిన మెగా ఫుడ్ పార్క్స్ ప్రాజెక్ట్‌ల జాబితా, ప్రాజెక్ట్ పూర్తి అయ్యే అంచనా సమయం, ప్రారంభం నుండి వాటి కార్యాచరణ స్థితి.., అలాగే ప్రతి మెగా ఫుడ్ పార్క్ల మొత్తం ప్రాజెక్ట్ వ్యయం, ఈ మెగా ఫుడ్ పార్క్‌లకు సంబంధించి ఆమోదించబడి.., విడుదల చేసిన మొత్తం ఆర్థిక సహాయం.., అదేవిధంగా మెగా ఫుడ్ పార్క్‌ల ద్వారా పొందిన మొత్తం ప్రైవేట్ పెట్టుబడి, ఈ మెగా ఫుడ్ పార్క్‌ల వల్ల ఉత్పన్నమైన ఉపాధి.., పార్క్ల వారీగా లిఖిత పూర్వకంగా వివరాలను కోరారు.దీనికి తక్షణం స్పందించిన కేంద్ర ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి రవ్నీత్ సింగ్.., మెగా ఫుడ్ పార్క్‌లకు సంబంధించిన సమాచారాన్ని లిఖిత పూర్వకంగా అందించినట్లు చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు గురువారం మీడియాకు తెలియజేసారు.మెగా ఫుడ్ పార్క్‌ల ద్వారా వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్‌ను కల్పించడంఅన్నదాతలకు ఆదాయం పెంచడం, నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడం,ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల అభివృద్ధి చెందేందుకు వీలవుతుందని ఆయన తెలిపారు.2008 నుంచి 2021 వరకూ ప్రధానమంత్రి కిసాన్ సంపద మెగా ఫుడ్ పార్క్స్ స్కీం అమలైందని, మెగా ఫుడ్ పార్క్ అమలు, యాజమాన్యం, నిర్వహణ బాధ్యత స్పెషియల్ పర్పస్ వెహికల్ / ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ (ఐఎ)తో ఉంటుందనీ,పథకం మార్గదర్శకాల ప్రకారం, అంతిమ ఆమోదం తేదీ నుండి ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడానికి 30 నెలల గడువు ఇస్తుందని కేంద్ర ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ తెలియజేసినట్లు ఆయన పేర్కొన్నారు.ప్రధాన మంత్రి కిసాన్ సంపద యోజన క్రింద, 41 మెగా ఫుడ్ పార్క్ ప్రాజెక్ట్‌లు ఆమోదించబడ్డాయనీ, వీటిలో 24 ప్రాజెక్ట్‌లు కార్యాచరణలో ఉన్నాయనీ సంబంధిత శాఖ వివరించినట్లు చెప్పిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ..,ఈ ప్రాజెక్ట్‌లు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, అస్సాం, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మిజోరం, ఒడిశా, రాజస్థాన్, తెలంగాణ, త్రిపుర, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్‌లో ఉన్నట్లు విశదీకరించారు.





