నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి డిసెంబర్ 11 రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరు తీవ్ర గాయాల పాలైన సంఘటన చౌడేపల్లిలో చోటుచేసుకుంది సంత గేటు వీధి నుంచి ఆమెని గుంటకు వెళ్లే మార్గంలో కందికుంట కట్టపై ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి ఈ ప్రమాదంలో సోమల మండలం ఎర్ర నాగులపల్లి కి చెందిన రామ్మోహన్ 49 కు కాలు విరిగిపోగా మరో స్కూటర్ లిస్టు పులికోన వంక సురేంద్రకు స్వల్ప గాయాలయ్యాయి గాయపడ్డ వారిద్దరిని 108 సేవల ద్వారా స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించగా ఇక్కడ రామ్మోహన్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మదనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు





