Friday, March 20, 2026

*ప్రశాంతంగా..జగిత్యాల జిల్లాలో మొదటి విడత సర్పంచ్ ఎన్నికలు** ఎస్పీ అశోక్ కుమార్ వెల్లడి* ఏడు మండలాల పోలింగ్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* ఒక్క అవాంఛనీయ ఘటన కూడా నమోదు కాలేదు.. * ఓటర్లు నిర్భయంగా ఓటు వేశారు * పటిష్ట బందోబస్తుతో పోలీసు యంత్రాంగం అప్రమత్తం —-*

నేటి సాక్షి – జగిత్యాల*( రాధారపు నర్సయ్య )జగిత్యాల జిల్లాలో గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల మొదటి విడత పోలింగ్ ప్రశాంత వాతావరణంలో ముగిసిందని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అశోక్ కుమార్ తెలిపారు. గురువారం ఉదయం నుంచి భీమారం, ఇబ్రహీంపట్నం, కథలాపూర్, కోరుట్ల, మల్లాపూర్, మేడిపెల్లి, మెట్‌పెల్లి మండలాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను ఆయన ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు.*ప్రశాంతంగా సాగుతున్న ఎన్నికలు – ఎస్పీ ధీమా*జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. మొదటి విడత సర్పంచ్ ఎన్నికలు ఎటువంటి ఆటంకాలు లేకుండా, పూర్తి ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా ఒక్క అవాంఛనీయ ఘటన కూడా నమోదు కాలేదు. ఓటర్లు స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని స్పష్టం చేశారు.*పటిష్ట బందోబస్తు – నిరంతర పెట్రోలింగ్*ఎన్నికల సందర్భంగా జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద తగినన్ని పోలీసు సిబ్బంది, ప్రత్యేక బృందాలు మోహరించామన్నారు. అదనంగా పెట్రోలింగ్ వాహనాలు, క్విక్ రెస్పాన్స్ టీమ్స్ (QRT), స్ట్రైకింగ్ ఫోర్సెస్ నిరంతరం గ్రామ గ్రామాన పర్యటిస్తూ శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నాయి.ఎలాంటి చిన్న సమస్య ఎదురైనా తక్షణమే స్పందించే విధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎస్పీ ధీమా వ్యక్తం చేశారు.*పోలింగ్ సిబ్బందికి కీలక సూచనలు*పోలింగ్ కేంద్రాలను సందర్శించిన సందర్భంగా ఎస్పీ విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బందికి పలు భద్రతా సూచనలు చేశారు. ఓటర్లు ఎదుర్కొనే ఏ చిన్న అసౌకర్యాన్నైనా వెంటనే పరిష్కరించామని, ఎవరూ భయాందోళనకు గురికాకుండా చూశామని పేర్కొన్నారు. అలాగే సున్నిత పోలింగ్ బూత్‌ల వద్ద మరింత అప్రమత్తంగా ఉండాలని, సీసీ కెమెరాలు, వీడియో రికార్డింగ్‌లను సక్రమంగా నిర్వహించాలని సూచించారు.జగిత్యాల జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఈ విధంగా పోలీసు యంత్రాంగం ఎంతో చురుకుగా, ప్రశాంతంగా ముగిశాయని ఎస్పీ అశోక్ కుమార్ నేతృత్వంలోని బృందం ఓటర్లకు పూర్తి భరోసా కల్పిస్తూ ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేయడానికి కృషి చేసింది._____

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News