నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)*రామచంద్రాపురం* మండలంలో వ్యవసాయం చేస్తున్న ప్రతి రైతుకి యూరియా అందిస్తామని, రబీ సీజన్లో వరి పంట పెట్టే రైతులకు దశలవారీగా యూరియా అందిస్తామని రైతులు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని సింగల్ విండో కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశం లో తెలియపరిచారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలోని అన్ని సచివాలయాల్లో యూరియా పంపిణీలో అవకతవకలపై వస్తున్న వార్తలో అవాస్తవమని తెలిపారు. తను రైతులను నేరుగా కలిసి వారి యొక్క పొలాలను సందర్శించి యూరియా మీకు ఎందుకు అందలేదు అనే వాస్తవాలను తెలుసుకున్నానని, వాళ్లకి యూరియా ఇప్పట్లో అవసరం లేదని ఒక మూట ఇచ్చినందున తదుపరి యూరియా అవసర పడుతుందని అనే విషయం పైనే ఆందోళన చెందారని రైతులు తెలియజేశారు అన్నారు. మండలంలో వరి పంట పెట్టే రైతులకు దశలవారీగా ప్రతి ఒక్క రైతుకి యూరియా అందిస్తామన్నారు. ఎమ్మెల్యే పులివర్తి నాని సహాయ సహకారాలతో ప్రతి వ్యవసాయ రైతుకి యూరియా అందిస్తామని తెలిపారు. సచివాలయాల్లో యూరియా తీసుకునే సందర్భంలో రైతులు కొంత సమయం వేచి ఉండాల్సిన అవసరం ఉందని కారణం రైతు యొక్క వివరాలు నమోదు ప్రక్రియ, డబ్బులు జమ చేసుకోవడం వల్ల కొంచెం ఆలస్యం అవుతుంది తప్ప గంటల తరబడి రైతులను ఎప్పుడు వేచి ఉంచ లేదన్నారు. ఎలాంటి రాజకీయాలకి తావు లేకుండా ప్రతి రైతుకు యూరియా అందించడం మా బాధ్యత అని తెలియజేశారు. ఇప్పటివరకు మండలంలో 2255 బ్యాగుల ఏరియా పంపిణీ జరిగిందని తెలిపారు.





