Friday, March 20, 2026

ఇప్పుడిప్పుడే జిల్లాగా కుదురుకుంటున్న తరుణంలో విభజించడం దారుణం..గతంలో జిల్లాలు ఏర్పడాలంటే యాభై నుంచి నూట యాభై సంవత్సరాలు పట్టేది.. గడికోట శ్రీకాంత్ రెడ్డి

నేటి సాక్షి అన్నమయ్య జిల్లా, శర్మ, డిసెంబర్ 11 ~అన్నమయ్య జిల్లా :-: అన్నమయ్య జిల్లాను విభజించకుండా యధావిధిగా కొనసాగించాలని కోరుతూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి గురువారం అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు వినతి పత్రం సమర్పించారు. కలెక్టర్ ను కలిసిన అనంతరం కలెక్టర్ కార్యాలయం వద్ద గడికోట శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో పార్లమెంటుకు ఓ జిల్లా అని ఏన్నికల వాగ్దానంలో భాగంగా ఓ కమిటీని నియమించిందని అప్పట్లో డీజీపీ గౌతమ్ సవాంగ్, ప్రిన్సిపల్ సెక్రటరీ నీలంసహనీ, కృష్ణబాబు, విజయ్ కుమార్ లతో కమిటీ ని ప్రభుత్వం నియమించిందని రాయచోటి బౌగోళికంగా కానీ వేనుకబడిన ప్రాంతం, మౌళిక వసతులు చూపిచడంలో కానీ, స్థలాలు పరిశీలన చేసిన తర్వాత కమీటీ జిల్లా కేంద్రం విషయంలో ఆ కమీటీ అనేక మార్లు విస్తృతంగా పర్యటనలు చేసిందని గడికోట శ్రీకాంత్ రెడ్డి గుర్తు చేశారు. ఎక్కడైతే కొత్తగా 13 జిల్లాలు ఏర్పాట్లు చేయాలనుకున్నారో అన్నిచోట్ల పరిశీలన చేశారు. ఆయా ప్రాంతాల్లో ప్రావీణ్యం కలిగిన వ్యక్తుల పేర్లను పరిగణంలోకి తీసుకోని పుట్టపర్తి సత్యసాయి, రాయచోటి అన్నమయ్య, తిరుపతి బాలాజీ, కోనసీమ అంబేద్కర్, యన్టీఆర్, అల్లూరి సీతారామరాజు వంటీ మహనుబావుల పేర్లతో జిల్లాలు ఏర్పాటు చేశారు. రాయచోటి ఆరు నియోజకవర్గాలకు కేంద్ర బిందువు, అభివృద్ధి చెందాల్సిన ప్రాంతం, వేనుకబడిన ప్రాంతాన్ని ఎంపిక చేయడం సంతోషాన్ని ఇచ్చింది. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. ఏ ప్రాంతానికి మేము వ్యతిరేకం కాదు. రాయచోటి ప్రాంతం జిల్లా కావడంతో ఎంతో ఆబివృద్ది చేందుతామని ఆశించాము. కానీ ఆదిలోనే ఆటంకం కలిగడం భాదకరం. చంద్రబాబు కొత్త జిల్లాల గేజిట్ విడుదల చేసి అన్నమయ్య జిల్లాలోని 60 శాతం భూభాగాన్ని ఇంకో జిల్లా చేశారు. దీని వల్ల రాష్ట్రంలోనే అతిచిన్న జిల్లాగా ఏర్పడి జిల్లా కేంద్రం కూడ ఒక మూలన చేరిపోయింది. దీంతో కొన్ని ప్రాంతాల్లో వైశమ్యాలు పెరుగుతున్నాయి. 1808 రాయలసీమలో బళ్లారి, కడప జిల్లాలు ఏర్పడ్డాయి. 1858లో అనంతపురం, కర్నూలు ఏర్పడ్డాయి. 1911లో చిత్తూరు జిల్లా ఇలా ప్రతి యాభై ఏళ్ల తర్వాత జిల్లాలు ఏర్పడ్డాయి. దాదాపు నూట పది సంవత్సరాల వరకు కోత్త జిల్లాలు ఏర్పాట కాలేదు. 2022 లో రాయలసీమ లో నంద్యాల, రాయచోటి, తిరుపతి, పుట్టపర్తి జిల్లాలు ఏర్పాటు చేశారు. దీంతో ఇన్ ప్రాస్ట్రక్చర్ ఏర్పడుతుందని రాయచోటి ప్రాంత వాసులు సంతోషించారు. గతంలో జిల్లాలు ఏర్పడాలంటే యాభై నుంచి నూట యాభై సంవత్సరాలు పట్టేది. మాకు అంత సమయం ఇవ్వకపోయిన కనీసం ముప్పై, యాభై సంవత్సరాల గడువిచ్చిన ఈ ప్రాంతం ఇన్ ఫ్రా స్టక్చర్ డెవలప్ అయ్యి అభివృద్ధి చెందిన ప్రాంతంగా ముందుకు వచ్చేది. రాయచోటి లో మేధావులు, విద్యావేత్తలు, గోప్ప గోప్ప లాయర్లు, గోప్ప గోప్ప వ్యాపారస్తులు వున్నారు. వారంత కన్సర్ ను చేయాల్సిన అవసరముంది. రాష్ట్రంలోనే రాయచోటి, మదనపల్లి, తంబళ్లపల్లి, పీలేరు త్రాగునీటి సమస్య ఏదుర్కోంటున్న ప్రాంతాలవి. వాటర్ ట్రాన్స్ పోర్ట్ ను నివారించాలని 2022లో అప్పటి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి విన్నవించి 2370 కోట్లు మంజూరు చేయించాం. రాయచోటి నియోజకవర్గంలోని 920 పల్లేలకు కూడ జేజేఎం వాటర్ గ్రీడ్ నీరు అందించేందుకు మంజూరు చేయించాము. వేలిగల్లు నుంచి రాయచోటికి, గడికోట నుంచి మిగిలిన మూడు నియోజకవర్గాలకు నీరు అందించేందుకు నాడు జీవో లో సైతం మెన్షన్ చేయించాము. రాయచోటి తో పాటు మదనపల్లి, తంబళ్లపల్లి, పీలేరు కు త్రాగునీరు అందించాలని నాటి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి జీవో విడుదల చేశారు. వ్యవసాయ ఆధారిత ప్రాంతం కావడంతో వెయి, రెండు వేల అడుగుల వరకు బోరు వేసిన నీరు రానీ పరిస్థితి. చేయ్యేరు, పాపఘ్ని, బహుదానదులు ఎక్కువగా వర్షం పడితే తప్ప నీరు రానీ పరిస్థితి. వాటిని అదిగమించడానికి శాశ్వత పరిష్కారం కోసం గడికోట నుంచి 20 టీఎంసీల నీరు కాలేటివాగు ద్వారా వేలిగల్లు కు, అక్కడి నుంచి కంచాలమ్మ గండి కి నీరు తెప్పించే పథకాన్ని మంజూరు చేయించాము. వెలిగల్లు నుంచి హంద్రీ – నీవా ద్వారా చిన్నమండ్యంకు, ఝరికోన నుంచి శెట్టిపల్లి చెరువులకు, కాలేటివాగు నుంచి లక్కిరేడ్డిపల్లి, రామపూరం చేరువులకు నీరు అందించాలని టెండర్లు పిలిపించి నిధులు మంజూరు చేయించి పనులన్నీ ప్రారంబించాము. కరోనా వల్ల, సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టడం వల్ల పనులు ఆలస్యంగా జరిగి చివరి దశకు చేరుకున్నాయి. జిల్లాలో తాగు, సాగు నీరు అందేలా పనులు చేపట్టాము. ఇప్పుడప్పుడే అన్ని పూర్తయి జిల్లా అభివృద్ధికి తోడ్పడే సమయంలో జిల్లాను ముక్కలు చేయడం సబబు కాదు. ఇప్పడు జనాభా లెక్కలు తీసుకుంటున్నారు. వచ్చే ఏడాది లో నియోజకవర్గాల పునర్విభజన జరగబోతోంది. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే మండలం ఏ నియోజకవర్గంలో వుంటుంది. ఎంత జనాభా వుంటుందనే అంచనా వచ్చిన తర్వాత జిల్లా విభజన చేయాలి. నాడు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కానీ, డీఎస్పీ కార్యాలయాలు పూర్తి చేసాం కలెక్టర్ బంగ్లా చివరి దశకు చేరుకుంది. హడావిడిగా జిల్లాను ముక్కలు చేయాల్సిందేనా. ప్రజల మనోభావాలతో పనిలేదా.మూడు సంవత్సరాల్లోనే జిల్లా కేంద్రం నాశనాన్ని కోరుకుంటున్నారు. యూనివర్సిటీ, కొత్త కలెక్టరేట్ వచ్చేంత వరకు, జిల్లా అభివృద్ధి చేందేవరకు కొన్నాళ్ల పాటు యధావిధిగా కొనసాగించాలని గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లాను యథాతథంగా కొనసాగించాలని..అన్నమయ్య జిల్లాను యథాతథంగా కొనసాగించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు లేఖ వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి లేఖ రాశారు. ~~~~~~~~~~~~~~~~

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News