నేటి సాక్షి నారాయణపేట డిసెంబర్ 11,రెండవ సాధారణ గ్రామ పంచాయతీ మొదటి విడత జరుగుతున్న ఎన్నికల పోలింగ్ సరళిని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మొదటి విడతలో జిల్లాలోని మద్దూరు కొత్తపల్లి గుండుమాల్ కోస్గి మండలాలలో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు జరుగనున్న పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు. ఈ క్రమంలో జిల్లాలో గుర్తించిన సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) సంచిత్ గంగ్వర్, రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్, నోడల్ అధికారి సాయిబాబా, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జాన్ సుధాకర్, డీ పీ ఆర్ వో రషీద్, పశు సంవర్ధక శాఖ అధికారి ఈశ్వర్ రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.





